ఎన్టీఆర్ పాత్రలో బాలయ్యతో పాటు..

  • IndiaGlitz, [Monday,February 26 2018]

జీవితకథ ఆధారిత (బయోపిక్) సినిమాలంటే.. ఆ వ్య‌క్తి జీవితానికి సంబంధించిన విషయాలు చెబుతారు చూడొచ్చు అనుకుంటారు ప్రేక్షకులు. కాని కొన్ని బయోపిక్‌ల‌కు మాత్రం ఆ వ్య‌క్తి జీవితానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడమే కాదు.. ఆ పాత్రలో ఇమిడిపోయే ఆ పాత్రధారుణ్ని కూడా చూడాలనుకుంటారు. ఇప్పుడు సరిగ్గా ఇటువంటి ప‌రిస్థితుల‌తో తర్జనభర్జనలు ప‌డుతున్నారు బాలకృష్ణ అండ్ టీం. మహానటుడు ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా యన్.టి.ఆర్' సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. దీనికి ఆయన తనయుడు బాలకృష్ణ ఓ నిర్మాత కాగా.. తేజ దర్శకుడు. ఇప్పటికీ పాత్రధారుల ఎంపిక జరుగుతూనే ఉంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన వార్త ఒకటి బయటికి వచ్చింది.

అదేమిటంటే.. ఎన్టీఆర్ యుక్తవయసులో ఉన్న సన్నివేశాలను చిత్రీకరించేందుకు వేరొక ఆర్టిస్ట్‌ను అన్వేషిస్తున్నార‌ట‌ బాలయ్య. ఎన్టీఆర్ నడివయస్కుడి పాత్రలో బాలయ్య కనిపించనున్న విషయం తెలిసిందే. మరి యుక్తవయస్కుడిగా బాలకృష్ణ సరిపోరు. ఆ వయసులో ఎన్టీఆర్ అందం గురించి అందరికి తెలిసిందే. చాలా సన్నగా ఉండేవారు. మరి ఇప్పటికిప్పుడు బాలకృష్ణ సన్నబడటం జరిగేపని కాదు. అందుకే ఆ పాత్ర కోసం వేరే నటుణ్ని వెతికే పనిలో పడింది యన్.టి.ఆర్‌' అండ్ టీం. స‌రిగ్గా.. అటువంటి నటుడి కోసం మహానటి' సినిమా టీమ్ కూడా ఎప్పటినుంచో వెతుకుతోంది. ఒకవేళ అటువంటి నటుడు దొరికితే.. రెండు సినిమాల్లో కూడా అతని చేతే ఎన్టీఆర్ పాత్రను చేయించే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఎన్టీఆర్ లాంటి మహానటుడు మాత్ర‌మే కాదు.. అంత అందగాడు కూడా దొరుకుతాడా? చూద్దాం.. దొరికితే ఈ చిత్రాల బృందాలతో పాటు ప్రేక్షకులకి కూడా కనువిందేగా మరి.

More News

కాజల్.. మూడో హ్యాట్రిక్

‘లక్ష్మీకళ్యాణం’(2007)తో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైన ఉత్తరాది భామ కాజల్ అగర్వాల్.

రెండో స్థానంలో చేరిన తమన్

యువ సంగీత సంచలనం తమన్..మరోసారి తెలుగు సినీ పరిశ్రమలో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయారు.

శ్రీదేవిగారి కుటుంబంతో నా అనుబంధం మరువలేనిది - ప్రముఖ నిర్మాత ఏ.ఎం.రత్నం

శ్రీదేవిగారితో నా అనుబంధం ఈనాటిది కాదు.నా సూపర్ హిట్ సినిమాల్లో ఎక్కువగా హిందీలో రీమేక్ చేసింది బోణీ కపూర్ గారే.

శ్రీదేవి చనిపోలేదు.. ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచే ఉంటుంది - చిరంజీవి

శ్రీదేవి గురించి ఇలాంటి ఒక సందర్భం వస్తుందని అనుకోలేదు.ఆమె గురించి ఇలా మాట్లాడాల్సి వస్తుందని నిజంగా నేనెప్పుడూ ఊహించలేదు.

అతిలోక సుందరి శ్రీదేవి కన్నుమూత

తనదైన అద్భుత నటనతో సినీ వినీలాకాశాన్ని ఏలిన నటి శ్రీదేవి(54)హఠాన్మరణం చెందారు.