బాలకృష్ణ, అల్లు అర్జున్ తో..
Send us your feedback to audioarticles@vaarta.com
ఈ ఏడాది 'జై సింహా'తో కమర్షియల్‌గా మంచి విజయాన్ని అందుకున్నారు ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్. ఆ తర్వాత వినాయక్, సాయిధరమ్ తేజ్ కాంబినేషన్లో వచ్చిన 'ఇంటిలిజెంట్' డిజాస్టర్‌గా మిగలడంతో నష్టాలు చవిచూశారు.
ఇదిలా ఉంటే.. ఇటీవల బాలకృష్ణ, వినాయక్ కలయికలో ఓ సినిమాను నిర్మిస్తున్నట్టు ప్రకటించారు కళ్యాణ్. అంతేగాకుండా.. తాజాగా ప్రీ-ప్రొడక్షన్ పనులను కూడా ప్రారంభించారు. మే 27న లాంఛన ప్రాయంగా షూటింగ్ ప్రారంభించి.. ఆపై నిరవధికంగా చిత్రీకరణను కూడా జరుపనున్నారు.
ఈ సినిమాతో పాటు.. అల్లు అర్జున్‌తో కూడా ఓ సినిమాను నిర్మించే ప్రయత్నంలో ఉన్నారట సదరు నిర్మాత. ఇటీవల దర్శకుడు సంపత్ నంది.. అల్లు అర్జున్‌కు ఓ కథను వినిపించారని.. ప్రస్తుతం బన్నీ నటిస్తున్న 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమా తర్వాత ఈ కొత్త చిత్రం పట్టాలెక్కే అవకాశాలున్నాయని ఫిల్మ్‌నగర్ వర్గాలు ముచ్చటించుకుంటున్నాయి.
త్వరలోనే ఈ రెండు భారీ సినిమాలకు సంబంధించి అధికారికంగా ఓ ప్రకటనను వెల్లడించనున్నారు నిర్మాత కళ్యాణ్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout