నాలుగేళ్ళ త‌రువాత బాల‌య్య‌తో..

  • IndiaGlitz, [Friday,May 11 2018]

రెండుత‌రాల‌కి చెందిన అగ్ర క‌థానాయ‌కులంద‌రితోనూ విజ‌యాలు అందుకున్న సంగీత ద‌ర్శ‌కుల‌లో దేవిశ్రీ ప్ర‌సాద్ ఒక‌రు. మ‌ణిశ‌ర్మ త‌రువాత ఆ ఘ‌న‌త ద‌క్కించుకున్న స్వ‌ర‌క‌ర్త దేవిశ్రీ‌నే. ప్ర‌తి అగ్ర క‌థానాయ‌కుడితోనూ రెండు లేదా అంత‌కుమించి అన్న‌ట్లుగా సినిమాలు చేసేసిన డీఎస్పీ.. బాలకృష్ణ విష‌యంలో ఒక సినిమాకే ప‌రిమితమ‌య్యారు. నాలుగేళ్ళ క్రితం విడుద‌లైన లెజెండ్ త‌రువాత వీరి కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా రాలేదు.

అయితే.. త్వ‌ర‌లోనే వీరి కాంబోలో మ‌రో సినిమా రాబోతుందంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. కాస్త వివ‌రాల్లోకి వెళితే.. బాల‌య్య‌, వి.వి.వినాయ‌క్ కాంబినేష‌న్‌లో చెన్న‌కేశ‌వ‌రెడ్డి త‌రువాత మ‌రో చిత్రం రాబోతున్న సంగ‌తి తెలిసిందే. సి.క‌ళ్యాణ్ నిర్మిస్తున్న ఈ భారీ బ‌డ్జెట్ చిత్రం ఈ నెల 27 నుంచి సెట్స్ పైకి వెళ్ళ‌నుంది. ఈ నేప‌థ్యంలో సంగీత ద‌ర్శ‌కుడిగా దేవిశ్రీని ఎంచుకున్న‌ట్లుగా తెలిసింది. త్వ‌ర‌లోనే దేవిశ్రీ ఎంట్రీపై అధికారిక ప్ర‌క‌ట‌న వ‌స్తుంది. శ‌ర‌వేగంగా ఈ సినిమాని పూర్తిచేసి.. వ‌చ్చే సంక్రాంతికి సినిమాని విడుద‌ల చేసే దిశ‌గా నిర్మాత స‌న్నాహాలు చేస్తున్నారు.