Parliament:నేటి నుంచి ఈనెల 22 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

  • IndiaGlitz, [Monday,December 04 2023]

నేటి నుంచి ప్రారంభమైన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈనెల 22 వరకూ కొనసాగనున్నాయి. అధికార ఎన్డీఏ కూటమిని ఇబ్బంది పెట్టేందుకు విపక్ష కూటమి రెడీ అవ్వగా.. వాటిని సమర్థంగా తిప్పికొట్టేందుకు బీజేపీ కూడా సిద్ధమైంది. ముఖ్యంగా టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాను లోక్‌సభ నుంచి బహిష్కరించాలని ఎథిక్స్‌ కమిటీ ఇచ్చిన నివేదిక మీద చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశాల్లో ఉభయసభల ముందుకు 24 బిల్లులు రానున్నాయి. ఐపీసీ, సీఆర్‌పీసీ స్థానంలో కొత్త బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టనుంది. అలాగే ఎన్నికల కమిషనర్ల నియామకంలో సీజేఐ ప్రమేయం లేకుండా అమలు చేసే బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనుంది. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలకు ముందు జరగనున్న ఈ సమావేశాలు వాడివేడీగా జరగనున్నాయి.

కొత్తగా తీసుకొచ్చే నేర బిల్లులకు హిందీలో పేర్లు పెట్టడంపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అందుచేత ఈ బిల్లులను ఉభయసభల్లో విపక్షాలు వ్యతిరేకించే అవకాశం ఉంది. అటు మణిపూర్‌లో హింస, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ప్రతిపక్ష నేతలపై ఈడీ, సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపైనా చర్చకు పట్టుబట్టనున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌లో ఏ అంశంపై చర్చకైనా తాము సిద్ధంగా ఉన్నామని.. కానీ చర్చలకు అవసరమైన అనుకూలమైన వాతావరణాన్ని విపక్షాలు సభలో కల్పించాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి తెలిపారు.

ఇదిలా ఉంటే ఇటీవల 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం.. ముఖ్యంగా రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో అధికారం కోల్పోవడం ఈ సమావేశాల్లో ప్రభావం చూపే అవకాశం ఉంది. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇవాళ జరుగుతున్న మిజోరం కౌంటింగ్‌లో కాంగ్రెస్, బీజేపీ అధికారంలోకి రావడం కష్టమనే చెప్పాలి.

More News

KCR:సీఎం పదవికి కేసీఆర్ రాజీనామా.. రేపే కాంగ్రెస్ సీఎం ప్రమాణస్వీకారం..

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సాధించింది. మొత్తం 65 స్థానాల్లో ఆ పార్టీ విజయం సాధించింది.

KCR, Revanth Reddy:కామారెడ్డిలో సంచలనం.. కేసీఆర్, రేవంత్‌ రెడ్డి ఓటమి..

కామారెడ్డి నియోజకవర్గంలో సంచలనం నమోదైంది. ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సీఎం కేసీఆర్,

KTR:ప్రతిపక్ష పాత్ర సమర్థవంతంగా పోషిస్తాం: కేటీఆర్

తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.

Telangana DGP:తెలంగాణ డీజీపీపై వేటు.. ఈసీ సంచలన నిర్ణయం..

తెలంగాణ ఫలితాల అనంతరం కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్ పై సస్పెన్షన్ వేటు వేసింది.

KTR:ఎన్నికల ఫలితాలపై స్పందించిన కేటీఆర్.. తమ గురి తప్పిందని ట్వీట్..

తెలంగాణ ఎన్నికల ఫలితాలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. తాజా ఫలితాలు నిరాశ కలిగించాయని..