BJP Candidates:గెలుపొందిన బీజేపీ అభ్యర్థులు వీరే..

  • IndiaGlitz, [Sunday,December 03 2023]

గత ఎన్నికల్లో కంటే ఈసారి బీజేపీ అభ్యర్థులు ఎక్కువ స్థానాల్లో విజయం సాధించారు. ఇప్పటివరకు 5 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు గెలుపొందగా.. మరో 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థి శంకర్ విజయం సాధించగా.. నిర్మల్‌లో మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డిపై మహేశ్వర్‌ రెడ్డి గెలుపొందారు. ఇక నిజామాబాద్ అర్బన్‌లోనూ బీజేపీ అభ్యర్థి సూర్యనారాయణరావు విజయం సాధించారు. ఇటు గోషామహల్ నియోజకవర్గం నుంచి రాజాసింగ్ హ్యాట్రిక్ సాధించారు. ఆర్మూర్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డిపై రాకేశ్ రెడ్డి విజయబావుటా ఎగరవేశారు.

ఇదిలా ఉంటే బీజేపీ ముఖ్య నేతలైన బండి సంజయ్ కరీంనగర్‌లో మంత్రి గంగుల కమలాకర్‌పై వెనుకంజలో ఉండగా.. హుజురాబాద్, గజ్వేల్‌ నుంచి పోటీచేసిన ఈటల రాజేందర్ రెండు స్థానాల్లోనూ వెనుకంజలో ఉండటం గమనార్హం. కోరుట్ల నుంచి పోటీ చేసిన ధర్మపురి అరవింద్ కూడా ఓటమి దిశగా సాగుతున్నారు. ఇప్పటికే దుబ్బాక నియోజకవర్గం నుంచి రఘునందన్ రావు ఓడిపోయారు. ఇక కామారెడ్డిలో మాత్రం బీజేపీ అభ్యర్థి ప్రస్తుం 14వ రౌండ్ ముగిసే సరికి 2వేలకు పైగా ఓట్లతో సీఎం కేసీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఆధిక్యంలో కొనసాగుతుండటం విశేషం.

కాగా 2018 ఎన్నికల్లో కేవలం ఒక సీటు మాత్రమే బీజేపీ గెలిచింది. గోషామహల్ నుంచి రాజాసింగ్ మాత్రమే గెలుపొందారు. ఆ తర్వాత జరిగిన హుజురాబాద్, దుబ్బాక ఎన్నికల్లో ఈటల రాజేందర్, రఘునందన్ రావు గెలిచి అసెంబ్లీలో కాషాయం బలాన్ని మూడుకు పెంచారు. ఈసారి కొద్దిగా పుంజుకుని స్థానాల్లో గెలుపొందే దిశగా కొనసాగుతోంది.

More News

Revanth Reddy, Komati Reddy:కొడంగల్‌లో రేవంత్ రెడ్డి.. నల్గొండలో కోమటిరెడ్డి ఘన విజయం

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొడంగల్‌లో భారీ మెజార్టీతో గెలిచారు. బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డిపై 32,800ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు.

Revanth Reddy:రేవంత్ రెడ్డి ఇంటికి డీజీపీ అంజనీకుమార్.. శుభాకాంక్షలు..

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటికి తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ వెళ్లారు. ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.

Congress, Brs:దక్షిణ, ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్.. గ్రేటర్ పరిధిలో బీఆర్ఎస్ హవా..

దక్షిణ తెలంగాణ, ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజార్టీ కనబరుస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో క్లీన్ స్వీప్ దిశగా కొనసాగుతోంది.

Congress Party:తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్ బోణీ.. రెండు చోట్ల విజయం..

తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ బోణీ కొట్టింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆశ్వారావుపేట నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఆదినారాయణ..

BJP-Congress:మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లో బీజేపీ.. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ఆధిక్యం..

తెలంగాణతో పాటు మిగిలిన మూడు రాష్ట్రాల్లోనూ కౌంటింగ్ ప్రారంభమైంది. మధ్యప్రదేశ్‌లో ఇప్పటి వరకూ జరిగిన కౌంటింగ్‌లో బీజేపీ 118 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా..