BJP Candidates:గెలుపొందిన బీజేపీ అభ్యర్థులు వీరే..
Send us your feedback to audioarticles@vaarta.com
గత ఎన్నికల్లో కంటే ఈసారి బీజేపీ అభ్యర్థులు ఎక్కువ స్థానాల్లో విజయం సాధించారు. ఇప్పటివరకు 5 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు గెలుపొందగా.. మరో 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థి శంకర్ విజయం సాధించగా.. నిర్మల్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై మహేశ్వర్ రెడ్డి గెలుపొందారు. ఇక నిజామాబాద్ అర్బన్లోనూ బీజేపీ అభ్యర్థి సూర్యనారాయణరావు విజయం సాధించారు. ఇటు గోషామహల్ నియోజకవర్గం నుంచి రాజాసింగ్ హ్యాట్రిక్ సాధించారు. ఆర్మూర్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డిపై రాకేశ్ రెడ్డి విజయబావుటా ఎగరవేశారు.
ఇదిలా ఉంటే బీజేపీ ముఖ్య నేతలైన బండి సంజయ్ కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్పై వెనుకంజలో ఉండగా.. హుజురాబాద్, గజ్వేల్ నుంచి పోటీచేసిన ఈటల రాజేందర్ రెండు స్థానాల్లోనూ వెనుకంజలో ఉండటం గమనార్హం. కోరుట్ల నుంచి పోటీ చేసిన ధర్మపురి అరవింద్ కూడా ఓటమి దిశగా సాగుతున్నారు. ఇప్పటికే దుబ్బాక నియోజకవర్గం నుంచి రఘునందన్ రావు ఓడిపోయారు. ఇక కామారెడ్డిలో మాత్రం బీజేపీ అభ్యర్థి ప్రస్తుం 14వ రౌండ్ ముగిసే సరికి 2వేలకు పైగా ఓట్లతో సీఎం కేసీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఆధిక్యంలో కొనసాగుతుండటం విశేషం.
కాగా 2018 ఎన్నికల్లో కేవలం ఒక సీటు మాత్రమే బీజేపీ గెలిచింది. గోషామహల్ నుంచి రాజాసింగ్ మాత్రమే గెలుపొందారు. ఆ తర్వాత జరిగిన హుజురాబాద్, దుబ్బాక ఎన్నికల్లో ఈటల రాజేందర్, రఘునందన్ రావు గెలిచి అసెంబ్లీలో కాషాయం బలాన్ని మూడుకు పెంచారు. ఈసారి కొద్దిగా పుంజుకుని స్థానాల్లో గెలుపొందే దిశగా కొనసాగుతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments