మొదటి షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకున్న వింగ్స్ మూవీ మేకర్స్ చిత్రం
Send us your feedback to audioarticles@vaarta.com
కార్తీక్‌రాజు, మిస్తి చక్రవర్తి హీరో హీరోయిన్లుగా వింగ్స్ మూవీ మేకర్స్ బేనర్‌పై ఇటీవల కొత్త చిత్రం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఎం.పూర్ణానంద్ దర్శకుడు. ప్రతిమ.జి నిర్మాత. ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. షూటింగ్‌లో భాగంగా ఈ సినిమా మొదటి షెడ్యూల్ చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా...
దర్శకుడు ఎం.పూర్ణానంద్ మాట్లాడుతూ - ''ఇదొక ప్రేమకథా చిత్రమ్ అయితే ఇప్పటి వరకు వచ్చిన ప్రేమకథా చిత్రాలకు భిన్నంగా ఇది సోషియో ఫాంటసీ ప్రేమకథాచిత్రమ్. ఫ్రెష్‌లుక్‌తో ఉంటుంది. సినిమా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మొదటి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఒక సాంగ్ సహా కీలక సన్నివేశాలను చిత్రీకరించాం. సినిమా అవుట్‌పుట్ చాలా బాగా వచ్చింది. త్వరలోనే సెకండ్ షెడ్యూల్‌ను స్టార్ట్ చేయబోతున్నాం. ఆ వివరాలను త్వరలోనే తెలియజేస్తాం. కార్తీకరాజు, మిస్తి చక్రవర్తిల మధ్య కెమిస్ట్రీ బ్యూటీఫుల్‌గా ఉంటుంది`` అన్నారు.
కార్తీక్‌రాజు, మిస్తి చక్రవర్తి, నాగినీడు, పృథ్వీరాజ్, జెమినిసురేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సిద్ధార్థ్, కెమెరా: మల్హర్‌భట్ జోషి, మాటలు: ప్రదీప్ ఆచార్య, పూర్ణానంద్.ఎం, ఆర్ట్: రామకృష్ణ, నిర్మాత: ప్రతిమ.జి, కథ, కథనం, దర్శకత్వం: పూర్ణానంద్.ఎం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com