వైరల్ న్యూస్: గొడుగుతో పాటు గాల్లోకి ఎగిరిపోయాడు!

  • IndiaGlitz, [Saturday,March 30 2019]

గొడుగుతో పాటు గాల్లోకి ఎగిరిపోవడమేంటి..? అని కాసింత ఆశ్చర్యంగా అనిపిస్తోంది కదూ.. కాస్త ఈ విషయంపై క్లారిటీ వస్తే నిజమా..? అవునా అంటూ ముక్కున వేలేసుకుంటారు. ఇదిగో ఈ పక్కనున్న వీడియో చూడండి అసలు విషయం మీకే అర్థమవుతుంది. టర్కీలో జరిగిన ఈ ఘటన అందర్నీ సంభ్రమాశ్చర్యాలతో ముంచెత్తుతోంది. ప్రస్తుతం ఈ వీడియో, న్యూస్ నెట్టింట్లో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. ఇంతకీ అసలేం జరిగింది..? గొడుగుతో పాటు గాల్లోకి మనిషి ఎలా వెళ్లిపోయాడు..? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

టర్కీలోని.. ఒస్మానియే ప్రావిన్స్ .. మార్కెట్ లో సాదిక్ కొకడల్లీ ఓ దుకాణం ముందు జనాల కోసం గొడుగు ఏర్పాటు చేయడం జరిగింది. పక్కనే కూర్చోవడానికి కుర్చీలు సైతం ఉన్నాయి. అయితే ఒక్కసారిగా ఆ పరిసర ప్రాంతాల్లో ఈదురుగాలులు బలంగా వీయడంతో ఎక్కడికక్కడ వస్తువులన్నీ చెల్లాచెదరుగా పడిపోయాయి. గొడుగు కూడా పైకి లేచిపోయేంత గాలి వీస్తోంది.. దీంతో ఆ గొడుగును గాలికి నిలువరించాలని సదరు దుకాణం సిబ్బంది యత్నించారు. అయితే ఆ భారీ గొడుగుపై అడుగు భాగాన ఉన్న వెయిటేజీపై నిలబడ్డాడు. గొడుగు నిలబడకపోగా.. దాంతో పాటు ఆ వ్యక్తి కూడా గాల్లోకి ఎగిరిపోయాడు.

కాగా.. గొడుగుతో పాటు కొన్ని అడుగుల ఎత్తుకు ఎగిరిన తర్వాత (అనగా 3-4 మీటర్లు) ఆ వ్యక్తి గొడుగును వదిలేసి కిందికి దూకేశాడని.. అయితే అతనికి ఎలాంటి గాయాలు కాకుండా సేఫ్‌గానే బయటపడ్డాడని.. టర్కీకి చెందిన కొన్ని చానెళ్లు చెబుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంత వరకూ తెలియరాలేదు.

More News

వైఎస్‌ కుటుంబానిది అలాంటి సంస్కృతి కాదు!

రాబోయే ఎన్నికల్లో విలువలు, విశ్వసనీయతకు పట్టం కట్టాలని వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైయస్‌ విజయమ్మ విజ్ఞప్తి చేశారు.

అవినీతిలేని రాజకీయ వ్యవస్థ కోసం జనసేనను గెలిపించండి

ఆదోని నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో రాష్ట్రంలో ఎక్కడా క‌న‌బ‌డ‌ని ఓ చిత్రమైన‌ రాజ‌కీయ ప‌రిస్థితులు క‌న‌బ‌డ‌తాయని, రాజ‌కీయ ప్రత్యర్ధులు కేవలం రాజ‌కీయాల‌కి మాత్రమే ప్రత్యర్ధులని,

ఉచిత విద్య, వైద్యం అందిస్తాం: పవన్

జ‌న‌సేన ప్రభుత్వం ఏర్పడిన త‌ర్వాత నంద్యాల పార్లమెంటుని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేస్తామ‌ని జ‌న‌సేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

కరవు సీమ కాదు.. కల్పతరువు సీమగా చేస్తా!

రాయ‌ల‌సీమ‌ క‌రవు సీమగా కాదు, క‌ల్పత‌రువు సీమ‌గా మారుస్తామ‌ని జ‌న‌సేన అధినేత పవన్ కల్యాణ్ సీమ ప్రజలకు హామీ ఇచ్చారు.

కొణిదెల గ్రామాన్ని దత్తత తీసుకుంటా..

"నా ఇంటి పేరైన గ్రామానికి రావడం సంతోషంగా ఉంది. నందికొట్కూరు నియోజ‌క‌వ‌ర్గంలో మా ఇంటి పేరుతో కొణిద‌ల గ్రామం ఉంది.