ఉమెనూ వైనూ ఒకటేనా?

  • IndiaGlitz, [Sunday,October 25 2015]

ఉమెన్, వైన్ ఒకటే. రెండూ పాత బడే కొద్దీ చాలా బావుంటాయి అని అంటోంది బాలీవుడ్ సెక్స్ సైరన్ బిపాసాబసు. తాజాగా ఆమె బుల్లితెరకు ఓ హారర్ సీరీస్ తో ఎంట్రీ ఇస్తోంది. ఇప్పుడు అందరూ ఆమెను హారర్ బ్యూటీ అనే పిలుస్తున్నారు. దీని గురించి బిపాసా మాట్లాడుతూ '' అందరూ నన్ను రకరకాల పేర్లతో పిలుస్తుంటే చాలా ఆనందంగా ఉంది. సెక్సీ సింబల్ అనే బిరుదు నా వయసు కారణంగానే మరుగున పడిందని నేను అనుకోను. ఎందుకంటే 80 ఏళ్ళప్పుడూ చాలా సెక్సీగా ఉన్నవారున్నారు. అందువల్ల వయసుకు, సెక్స్ సెంబల్ అనే పేరుకు ఎలాంటి సంబంధమూ లేదు. మగువ, వైనూ ఒకటే. రెండూ పాతబడేకొద్దీ చాలా బావుంటాయి'' అని చెప్పుకొచ్చింది బిపాసా బసు.