వినాయక్ రిపీట్ చేస్తాడా?
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా ఫ్యామిలీకి బాగా కలిసొచ్చిన దర్శకుడు వి.వి.వినాయక్. ముఖ్యంగా ఈ క్యాంప్‌లోని హీరోలతో వినాయక్ చేసిన మొదటి చిత్రాలన్నీ విజయం సాధించాయి. మెగాస్టార్ చిరంజీవితో తొలిసారిగా చేసిన ఠాగూర్.. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‌తో మొదటిసారిగా చేసిన బన్ని.. అలాగే మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్‌తో ఫస్ట్ టైమ్ తెరకెక్కించిన చిత్రం నాయక్ బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ చిత్రాలుగా పేరు తెచ్చుకున్నాయి. ఈ నేపథ్యంలో సాయిధరమ్‌తేజ్‌తో తొలిసారిగా వి.వి.వినాయక్ చేస్తున్న సినిమా కూడా ఆ ఫీట్‌ని రిపీట్ చేస్తుందేమో చూడాలంటున్నారు సినీ విశ్లేషకులు.
ఇవాళ్టి నుంచి రెగ్యులర్ షూటింగ్‌ని ప్రారంభించుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. లావణ్య త్రిపాఠి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాపై సాయిధరమ్ చాలా ఆశలనే పెట్టుకున్నాడు. సుప్రీమ్ తరువాత సరైన విజయం లేకపోవడమే ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com