బన్ని కోరికను విజయ్ తీరుస్తాడా?
Send us your feedback to audioarticles@vaarta.com
ఆదివారం టాక్సీవాలా ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది. ఈ పంక్షన్‌కి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా వచ్చాడు. వేదికపై మాట్లాడుతూ విజయ్ దేవరకొండ ఫంక్షన్‌కి వేసుకొచ్చిన డ్రస్ బావుందని ప్రశంసించాడు.
విజయ్ దేవరకొండ రౌడీస్ కంపెనీ నుండి తనకొక మంచి డిజైనర్ డ్రెస్ కావాలని ఆ కోరిక తీరిస్తే తాను కూడా విజయ్ దేవరకొండ కోసం తాను ఓ పాట చేసి పెడతానని అన్నాడు.
తానే డిజైనర్‌గా మారి బన్ని కోసం ఓ మంచి డ్రెస్‌ను డిజైన్ చేస్తానని విజయ్ బదులిచ్చాడు. టాక్సీవాలా ఈ నెల 17న విడుదలవుతుంది. హారర్ సైంటిఫిక్ థ్రిల్లర్‌గా సినిమా తెరకెక్కింది. రాహుల్ సంక్రిత్యాన్ దర్శకుడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments