'వాల్మీకి' ..వాయిదా తప్పేలా లేదా?
Send us your feedback to audioarticles@vaarta.com
`సాహో` ఎఫెక్ట్ చాలా సినిమాలపై ఇన్ డైరెక్టర్‌గా ఎఫెక్ట్ చూపించింది. `ఎవరు`, `రణరంగం` వంటి సినిమాలు ప్రీ పోన్ అయితే.. చాలా వరకు సినిమాలు పోస్ట్ పోన్ అయ్యాయి. ఆ ఎఫెక్ట్ `నానిస్ గ్యాంగ్ లీడర్`, వరుణ్ తేజ్ `వాల్మీకి` చిత్రాలపై కూడా పడింది. `నానిస్ గ్యాంగ్‌లీడర్`ని ఆగస్ట్ 30న విడుదల చేయాలనుకన్నారు. అదే రోజున `సాహో` వస్తుండటంతో సినిమాను సెప్టెంబర్ 13కి వాయిదా వేశారు.
సెప్టెంబర్ 6న రావాలనుకున్న `వాల్మీకి` బాక్సాఫీస్ వద్ద థియేటర్స్ సమస్య వచ్చే అవకాశాలుండటంతో సెప్టెంబర్ 13నే వాయిదా పడింది. దీంతో నాని, వరుణ్‌తేజ్‌లు బాక్సాఫీస్ వద్ద పోటీ పడటం ఖాయమనుకున్నారందరూ. అయితే ఇప్పుడు `వాల్మీకి` వాయిదా పడే అవకాశాలున్నాయని గుసగుసలు వినపడుతున్నాయి. ఎందుకంటే ఒకేరోజు ఒరే రేంజ్ ఉన్న హీరోలు పోటీ పడితే నష్టం వాటిల్లే సమస్య ఉందని డిస్ట్రిబ్యూటర్స్ భావించి `వాల్మీకి`ని వాయిదా వేయమని నిర్మాతలను కోరారట. డిస్ట్రిబ్యూటర్స్ కోరిక మేర `వాల్మీకి` వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని సినీ వర్గాలు అంటున్నాయి. త్వరలోనే అధికారిక సమాచారం వెలువడనుందని టాక్. ఈ విషయంలో నాని, వరుణ్‌తేజ్ సినిమాల నిర్మాతలు ప్రొడ్యూసర్స గిల్డ్‌ను కలవనున్నారు.
తమిళ చిత్రం `జిగర్ తండా`కు రీమేకే `వాల్మీకి`. వరుణ్‌తేజ్, అధర్వమురళి, పూజా హెగ్డే, మృణాళిని రవి ప్రధాన పాత్రధారులు. హరీశ్ శంకర్ దర్శకుడు. వరుణ్‌తేజ్ రౌడీగా నటిస్తుంటే అధర్వమురళి అసిస్టెంట్ డైరెక్టర్‌గా కనిపిస్తాడు. పూజాహెగ్డే పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపించనుంది. మిక్కీ జె.మేయర్ సంగీత సారథ్యం వహిస్తోన్న ఈ చిత్రానికి సంబంధించిన ఇప్పటికే జర్ర.. జర్ర అనే సాంగ్ విడుదలై మంచి స్పందనను రాబట్టుకుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout