త్రివిక్రమ్.. ఎన్టీఆర్ సినిమాతో ట్రాక్ ఎక్కుతారా?
Send us your feedback to audioarticles@vaarta.com
త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు చెబితే.. తూటాల్లా పేలే డైలాగులు, మనసును హత్తుకునే మాటలు, హాయిగా నవ్వుకునే పంచ్‌లు గుర్తుకొస్తాయి. కాని ఈ మధ్య వస్తున్న సినిమాల్లో.. త్రివిక్రమ్ కలంలోని మునుపటి మెరుపులు తగ్గాయి. ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన 'అజ్ఞాతవాసి' లో గాని, తాజాగా త్రివిక్రమ్ కథను అందించిన 'ఛల్ మోహన్ రంగ' లో గాని ఆ మెరుపులు, విరుపులు కనిపించవు.
'ఛల్ మోహన్ రంగ' విషయానికొస్తే.. ఆ సినిమాకు త్రివిక్రమ్ చేయి పడకుండా ఉంటే బాగుండేదనీ.. దర్శకుడు కృష్ణ చైతన్య తనదైన శైలిలో తీసి ఉంటే విజయం సాధించవారేమోనని పరిశ్రమ వర్గాలు ముచ్చటించుకుంటున్నాయి.
ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌తో కలిసి త్రివిక్రమ్ సినిమా అంటే.. సగటు ఎన్టీఆర్ అభిమాని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే వరుసగా నాలుగు హిట్లతో ఉన్న ఎన్టీఆర్ ఈ సినిమాతో కూడా విజయాన్ని అందుకుని.. రాజమౌళి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్‌లో ఫుల్ జోష్‌లో నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి పూర్తిగా ట్రాక్ తప్పిన త్రివిక్రమ్ పరాజయాల్ని కొనసాగిస్తారో.. లేక ఎన్టీఆర్‌తో కలిసి సక్సెస్ ట్రాక్ ఎక్కుతారో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com