త్రిష మ్యాజిక్ రిపీట్ చేస్తుందా?

  • IndiaGlitz, [Wednesday,December 02 2015]

మూడు ప‌దుల వ‌య‌సు దాటిన త‌ర్వాత త్రిష కూడా త్రిష మంచి అవ‌కాశాల‌ను అందిపుచ్చుకుంటుంది. త‌మిళంలో సుంద‌ర్‌.సి దర్శ‌క‌త్వంలో అర‌న్మ‌ణి(తెలుగులో చంద్ర‌క‌ళ‌) సీక్వెల్ అరన్మ‌ణి2తో పాటు నాయిక సినిమాలో న‌టిస్తుంది. రెండు సినిమాలు కూడా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో చివ‌ర‌కు చేరుకున్నాయి. ముఖ్యంగా కామెడి హ్ర‌ర‌ర్ కాన్సెప్ట్‌గా రూపొందిన అరన్మ‌ణి2 సినిమా చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది. సిద్ధార్థ్‌,త్రిష న‌టించిన ఈ సినిమాలో హ‌న్సిక కూడా న‌టిస్తుంది. ప్ర‌ధానంగా కామెడి చిత్రాల‌ను తెర‌కెక్కించే సుంద‌ర్‌.సి చంద్ర‌క‌ళ చిత్రాన్నికామెడితో పాటు హ్ర‌ర‌ర్ జోడించి స‌క్సెస్ కొట్టాడు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా త‌ర్వాత మ‌రోసారి జ‌త క‌డుతున్న ఈ జోడి ఎలాంటి స‌క్సెస్ సాధిస్తుందో చూద్దాం..

More News

సెన్సార్ పూర్తి చేసుకున్న 'బెంగాల్ టైగర్'

'బలుపు','పవర్ ' వంటి వరుస సూపర్ హిట్ చిత్రాల తరువాత మాస్ మహరాజ్ రవితేజ హీరోగా,తమన్నా,రాశి ఖన్నా హీరోయిన్స్ గా,రచ్చ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత సంపత్ నంది దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'బెంగాల్ టైగర్'.

సూపర్ స్టార్ గొప్ప మనసు

అకాల వర్షాలతో చెన్నై అతలాకుతలమవుతున్న సంగతి తెలిసిందే.తమిళనాడులోని పలు చోట్ల పడుతున్న వర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయమై కనిపిస్తున్నాయి.

99 వెహికిల్స్ పై బాలయ్య ఫ్యాన్స్...

నందమూరి నట సింహంబాలక్రిష్ణ నటిస్తున్న 99వ సినిమా డిక్టేటర్.ఈ చిత్రాన్నిశ్రీవాస్ తెరకెక్కిస్తున్నారు.ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ డైరెక్టర్ శ్రీవాస్ తో కలసి ఈ చిత్రాన్నినిర్మిస్తుంది.

7న వ‌రుణ్ నిశ్చితార్థం

హ్యాపీడేస్ సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన హీరో వ‌రుణ్ సందేశ్‌. ఆ త‌ర్వాత కొత్త‌బంగారులోకం ఆయ‌న‌కు కెరీర్‌లో చాలా పెద్ద హిట్.

2 నుంచి స్పెయిన్ లో తారక్!

ఎన్టీఆర్,సుకుమార్ కాంబినేషన్ లో రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీచిత్ర ఎల్ఎల్పి పతాకంపై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం'నాన్నకు ప్రేమతో..'.