త్రిష ఇక వాటికే పరిమితమా?
Send us your feedback to audioarticles@vaarta.com
'వర్షం', 'నువ్వొస్తానంటే నేనొద్దాంటానా', 'అతడు', 'ఆకాశమంత'.. ఇలా కొన్ని చిత్రాల్లో ది బెస్ట్ అనదగ్గ యాక్టింగ్ స్కిల్స్‌ని ప్రదర్శించింది త్రిష. ఆ తరువాత ఆమెకి ఆ రేంజ్ పాత్రలైతే దొరకలేదనే చెప్పాలి. ప్రస్తుతం ఫేడ్ అవుట్ దశలో ఉన్న త్రిష.. కొంతకాలంగా ఒకే జోనర్ సినిమాలపై డిపెండ్ అవుతూ వస్తుంది. ఆ జోనర్ ఏమిటంటే.. హర్రర్.
ఇటీవలే వచ్చిన 'కళావతి' అనే తమిళ డబ్బింగ్ సినిమాలో కాసేపు భయపెట్టిన త్రిష, అతి త్వరలో 'నాయకి'గా మరింతగా భయపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ రెండు చిత్రాల తరువాత మరో దెయ్యం సినిమాకి ఈ చెన్నై చిన్నది ఓకే చెప్పిందని తమిళ సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. మాదేష్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ తమిళ సినిమా జూన్ లో సెట్స్ పైకి వెళ్లనుందని, లండన్ నేపథ్యంలో సినిమా ఉంటుందని తెలుస్తోంది.
ఏదీఏమైనా త్రిష వైఖరి చూస్తే హర్రర్ సినిమాలపైనే దృష్టి పెడుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతోందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com