టాలీవుడ్లో ఆ మూడు బూతు సినిమాలకు బ్రేక్ పడనుందా!!
Send us your feedback to audioarticles@vaarta.com
ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ముద్దు సీన్లు తీయాలన్నా.. నటించాలన్నా ఎంతగానో ఆలోచించే వారు.. అయితే ఇప్పుడు మాత్రం ఆ ముద్దు సీన్లే కాదు.. ఇంకేవేవో ఏకంగా సినిమాల్లోనే కానిచ్చేస్తున్నారు. ఇందుకు నిదర్శనం కొత్తగా చెప్పనక్కర్లేదు. ఒక్క ముద్దు సీన్లే కాదు.. నాలుగు గోడల మధ్య ఎవరూ లేనప్పుడు చేయాల్సిన పనులన్నీ.. వందల సంఖ్యలో థియేటర్లలో చూసే సినిమాల్లో చూపించేస్తున్నారు. ఇదీ ఇప్పుడు టాలీవుడ్ పరిస్థితి.! అంటే ఫ్యామిలీతో కలిసి చూసే సినిమాలు అస్సలు రాలేదా..? అంటే అవి కూడా వస్తున్నాయ్.. కానీ పైన చెప్పిన సినిమాలు ఎక్కువవుతున్నాయ్.
అంతా బూతుమయం!
ఇక అసలు విషయానికొస్తే.. ఎప్పుడైతే ‘అర్జున్ రెడ్డి’, ‘ఆరెక్స్-100’ సినిమాలు టాలీవుడ్లోకి వచ్చాయో.. అప్పట్నుంచి బూతు కంటెంట్ సినిమాలు ఎక్కువైపోతున్నాయి. ఇందుకు నిదర్శనమే.. ‘ఏడు చేపలకథ’, ‘రొమాంటిక్ క్రిమినల్స్’, ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’, తాజాగా వచ్చిన ‘డిగ్రీ కాలేజ్’ ఈ సినిమా పోస్టర్లు, ట్రైలర్లలో పరమ బూతులు తప్ప ఏమీ కనపడవ్. అయితే ట్రైలర్లు, పోస్టర్లలోనే అట్రాక్టివ్ గా ఉంటాయంతే.. సినిమాలో మంచి మెసేజ్ ఉంటుందని సదరు సినిమాలు తీసిన దర్శకులు మీడియాకే హితబోధ చేస్తున్నారు. ఒకప్పుడు ముద్దుల సీన్లంటే వామ్మో.. అనుకునేవారు దర్శకనిర్మాతలు.. ఇప్పుడు మాత్రం వావ్.. ఇంకా కొన్ని సీన్లు యాడ్ చేయండన్నట్లుగా అంతా బూతుయయం చేస్తున్నారని సినీ క్రిటిక్స్ విమర్శలు గుప్పిస్తున్నారు.
బూతు సినిమాలకు బ్రేక్ పడుతుందా..!?
అయితే ఈ సినిమాలను తీస్తున్న డైరెక్టర్లను ఇలాగే వదిలేస్తే మరింత శృతి మించే అవకాశాలు మెండుగా ఉన్నాయని.. ఎలాగైనా సరే అడ్డుకోవాలని భావించిన 'తెలంగాణ ప్రగతిశీల యువజన సంఘం' (పీవైఎల్) కంకణం కట్టుకుంది. 'ఏడు చేపలకథ', 'రొమాంటిక్ క్రిమినల్స్', 'డిగ్రీ కాలేజ్' లాంటి సినిమాలతో యువత అట్రాక్టయ్యి.. ఓహో.. యూత్ అంటే ఇలానే ఉండాలా అని ప్రేరేపితమై ఏదేదో చేయాలని.. చిన్నపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. కావున యూత్‌ను పెడదారి పట్టించేలా నేరాలు, ఘోరాలు పెంచేలా ఉన్న ఇలాంటి సినిమాలను రిలీజ్ కాకుండా అడ్డుకోవాలని.. ఇలాంటి సినిమాలను తెరకెక్కిస్తున్న దర్శక నిర్మాతలపై కఠిన చర్యలు తీసుకోవాలని పీడీఎస్‌యూ, పీవైఎల్ విద్యార్థి సంఘాలు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. మొత్తానికి చూస్తే ఈ బూతు సినిమాల రిలీజ్‌కు ఆదిలోనే బ్రేక్ పడిందన్న మాట. ఈ సినిమాలు ఇక సెన్సార్ బోర్డు దాకా వెళితే పరిస్థితి ఎలా ఉంటుందో మరి. తాజా ఫిర్యాదుపై పోలీసులు ఎలా ముందుకెళ్తారో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments