సినిమా శాఖ‌ల్లో ఈ టీమ్ అస‌రం వ‌స్తుందా?

  • IndiaGlitz, [Monday,July 13 2020]

ఇప్ప‌టి వ‌ర‌కు 24 శాఖ‌లే సినిమాలకు ప‌నిచేస్తూ వ‌చ్చాయి. అయితే త్వ‌ర‌లోనే మ‌రో కొత్త శాఖ కూడా వీటితో జాయిన్ కానుంద‌ట‌. ఆ శాఖ ఏదో కాదు కోవిడ్ ప్రొట‌క్ష‌న్ సిస్ట‌మ్‌. అస‌లు ఈ టీమ్ అవ‌శ్య‌క‌త ఏంటో పేరులోనే తెలిసిపోతుంది. ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా కోవిడ్ 19 కార‌ణంగా దారుణంగా దెబ్బ‌తిన్న రంగ‌మేదైనా ఉందంటే.. సినీ రంగ‌మ‌నే చెప్పుకోవాలి. దాదాపు ఐదు నెల‌లుగా సినిమా రంగం ఓ పిడికిలిలో బంధించిన‌ట్లుగా మారిపోయింది. 24 శాఖ‌లు క‌లిస్తేనే సినిమా. కానీ ఇప్పుడ‌లా క‌లిసే ప‌రిస్థితులు లేవు. ఈ ప‌రిస్థితులు పోవాలంటే వ్యాక్సిన్ రావాల్సిందే. కానీ అప్ప‌టి వ‌ర‌కు సినిమా షూటింగ్స్ ఆగాలా? .. దీనికి మేక‌ర్స్ ఓ ప్లాన్ చేసుకుంటున్నారు. దాని ప్ర‌కారం చిత్ర యూనిట్‌తో కోవిడ్ ప్రొటెక్ష‌న్ టీమ్‌ను ఏర్పాటు చేస్తుంది.

ఈ యూనిట్‌లోని స‌భ్యులు చిత్ర యూనిట్ అవుట్ డోర్ అయినా.. ఇండోర్‌లో ఉన్నా కోవిడ్ నివార‌ణ‌కు త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంటారు. షూటింగ్‌కు అవ‌స‌ర‌మైన వ‌స్తువులు, కాస్ట్యూమ్స్‌‌ను అల్ట్రా కాంతికిర‌ణాలున్న గ‌దిలోనో బాక్సులోనో సేవ్ చేస్తారు. త‌ర్వాత షూటింగ్ ప్రారంభించే ముందు దాన్ని సోడియం హైపో క్లోరైడ్‌తో శుభ్రం చేస్తారు. త్వ‌ర‌లోనే ఇలాంటి టీమ్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ప్ర‌భాస్ రాధేశ్యామ్‌, అల్లు అర్జున్ పుష్ప షూటింగ్స్ ప్రారంభం కానున్నాయ‌ని స‌మాచారం.