ఈ సూర్యగ్రహణం కరోనాకు చెక్ పెట్టనుందా?
- IndiaGlitz, [Sunday,June 21 2020]
యోగా డేను కూడా మరిపించేలా దేశవ్యాప్తంగా రాహుగ్రస్త సూర్యగ్రహణం కొనసాగుతోంది. దాదాపు 4 గంటల పాటు ఉండే ఈ ఖగోళ అద్భుతం ఓ శుభవార్తను అందించింది. ఉదయం 10.15 గంటల నుంచి మధ్యాహ్నం 1.49 వరకు ఉండే ఈ గ్రహణం కారణంగా ప్రపంచానికి ఓ మేలు జరుగనుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గ్రహణం కారణంగా భూమిమీద పడే అతినీలలోహిత కిరణాల వల్ల కరోనా వైరస్ కొంతమేరకు నశించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 0.001 శాతం నశించనుందని అంచనా వేస్తున్నారు. అదే నిజమైతే ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాపై విజయం సాధించిడానికి శాస్త్రవేత్తలకు ఏదైనా మార్గం లభించే అవకాశం ఉంటుందని పలువురు అంటున్నారు.
ఆదివారం... అమావాస్య... కంకణ సూర్యగ్రహణం కూడా! నాసా లెక్కల ప్రకారం చంద్రుడు సూర్యుడిని 99.4శాతం...అంటే దాదాపుగా సంపూర్ణంగా అడ్డుకుంటాడు. ఈ సమయంలోనే సూర్యుడు ‘కంకణం’లాగా కనిపిస్తాడు. అందుకే దీన్ని కంకణ సూర్యగ్రహణం అన్నారు. 2020లో వస్తున్న మొదటి సూర్యగ్రహణమిది. సూర్యగ్రహణం కారణంగా దేశంలోని ప్రధాన ఆలయాల్లో దర్శనాలను రద్దుచేశారు. మళ్లీ 2022లో సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది.