రానాకి ఈసారైనా కలిసొచ్చేనా?
Send us your feedback to audioarticles@vaarta.com
'బాహుబలి'తో ఫుల్‌ఫామ్‌లోకి వచ్చేసాడు రానా. కేవలం టాలీవుడ్లోనే కాకుండా దేశవ్యాప్తంగా భళ్లాల దేవ పాత్రతో అభిమానులను సంపాదించుకున్నాడు. ఈ నేపథ్యంలో అతని తదుపరి విడుదలగా రానున్న 'రుద్రమదేవి'పై అందరి కళ్లు పడ్డాయి. ఈ నెల 9న రానున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. అయితే ఎటొచ్చి.. రానాకి కలిసిరాని ఓ అంశం మాత్రం ఈ సినిమా విషయంలో ఉంది.
అదేమిటంటే.. తన బాబాయ్ వెంకటేష్‌తో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసిన భామలు తన పక్కన నటించిన సందర్భంలో రానాకి విజయాలు దక్కలేదు. 'సుభాష్ చంద్రబోస్' కోసం వెంకీ ఆడిపాడిన జెనీలియా 'నా ఇష్టం' కోసం రానాతో జతకట్టిన సందర్భంలోనూ.. అలాగే 'లక్ష్మీ', 'తులసి' చిత్రాల కోసం వెంకీతో రొమాన్స్ చేసిన నయనతార 'కృష్ణం వందే జగద్గురుమ్' కోసం రానాతో జోడీ కట్టిన సందర్భంలోనూ ఆశించిన విజయాలు దక్కలేదు.
ఈ నేపథ్యంలో 'చింతకాయల రవి', 'నాగవల్లి' సినిమాల కోసం వెంకటేష్‌కి పెయిర్ గా నటించిన అనుష్క.. రానాతో జట్టుకట్టిన 'రుద్రమదేవి' కూడా అదేబాటలో పయనిస్తుందో లేదంటే చరిత్రను తిరగరాస్తుందో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com