ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తారా?

  • IndiaGlitz, [Thursday,September 14 2017]

నారా రోహిత్‌, నాగ‌శౌర్య.. ఈ కాంబినేష‌న్ అన‌గానే మ‌న‌కు వెంట‌నే గుర్తొచ్చే సినిమా జో అచ్యుతానంద‌. అన్న‌ద‌మ్ముల అనుబంధం నేప‌థ్యంలో సాగే ఈ చిత్రం వినోదాత్మ‌కంగా ఉండి.. ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందింది. రెజీనా హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమా గ‌తేడాది సెప్టెంబ‌ర్ 9న విడుద‌లైంది. క‌ట్ చేస్తే.. ఇప్పుడు మ‌ళ్లీ నారా రోహిత్‌, నాగ‌శౌర్య ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన కొత్త చిత్రం క‌థ‌లో రాజ‌కుమారి కూడా అదే సెప్టెంబ‌ర్‌లో అంటే ఈ నెల‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.
న‌మితా ప్ర‌మోద్‌, నందిత హీరోయిన్లుగా న‌టించిన ఈ చిత్రం రేపు ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. మ‌రి.. జో అచ్యుతానంద లాగే ఈ చిత్రం కూడా ఫీల్ గుడ్ ఎంట‌ర్‌టైన‌ర్ అనిపించుకుంటుందో లేదో తెలియాలంటే రేప‌టివ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే. మ‌హేష్ సూర‌ప‌నేని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రానికి మ్యూజిక్ మేస్ట్రో ఇళ‌య‌రాజాతో పాటు విశాల్ చంద్ర‌శేఖ‌ర్ సంగీత‌మందించారు.