'భార‌త్‌' ఉంచుతారా? ఉంచ‌రా?

  • IndiaGlitz, [Friday,May 31 2019]

'భార‌త్‌' అంటే ఈ మ‌ధ్య దేశం క‌న్నా, స‌ల్మాన్‌ఖాన్ సినిమా అనేది ఎక్కువ మందికి గుర్తుకొస్తుంది. అంత‌గా జ‌నాల్లోకి వెళ్లింది స‌ల్మాన్ తాజా సినిమా 'భార‌త్‌'. క‌త్రినా కైఫ్ నాయిక‌గా న‌టిస్తున్న ఈసినిమాను ఈద్ సంద‌ర్భంగా జూన్ 5న విడుద‌ల చేయాల‌ని అనుకున్నారు. అయితే ఈ సినిమా ఇంకో ఆరు రోజుల్లో విడుద‌లకానుంద‌న‌గా, ఓ వ్య‌క్తి కోర్టులో కేసు వేశారు. ఆ వ్య‌క్తి పేరు విపిన్ త్యాగి. ఈ టైటిల్‌ను తీసి వేయాల‌ని, దేశ భ‌క్తుల మ‌నోభావాల‌ను కించ‌ప‌రిచేలా టైటిల్ ఉంద‌ని, స‌ల్మాన్ రీల్ నేమ్‌తో, భార‌త్‌ను పోల్చ‌డం స‌రికాద‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు.

ఢిల్లీ హైకోర్టు ఈ విష‌య‌మై ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో వేచి చూడాలి మ‌రి. మ‌రోవైపు ఇటీవ‌ల వ‌ర‌కు కూడా సినిమా యూనిట్ చిత్రాన్ని చాలా బాగా ప్ర‌మోట్ చేసింది. పెద్ద సినిమాల విడుద‌ల సంద‌ర్భంలో ఈ మ‌ధ్య చాలానే అడ్డంకులు ఏర్ప‌డుతున్నాయి. 'భార‌త్‌'విష‌యాన్ని ఆ దృష్టితో చూడాలా? లేకుంటే దేశ‌భ‌క్తి పాయింట్‌లో చూడాలా అనేది స‌ర్వ‌త్రా జ‌రుగుతున్న చ‌ర్చ‌. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను సునీల్ నారంగ్ విడుద‌ల చేస్తున్నారు.