'భారత్' ఉంచుతారా? ఉంచరా?
Send us your feedback to audioarticles@vaarta.com
`భారత్` అంటే ఈ మధ్య దేశం కన్నా, సల్మాన్‌ఖాన్ సినిమా అనేది ఎక్కువ మందికి గుర్తుకొస్తుంది. అంతగా జనాల్లోకి వెళ్లింది సల్మాన్ తాజా సినిమా `భారత్`. కత్రినా కైఫ్ నాయికగా నటిస్తున్న ఈసినిమాను ఈద్ సందర్భంగా జూన్ 5న విడుదల చేయాలని అనుకున్నారు. అయితే ఈ సినిమా ఇంకో ఆరు రోజుల్లో విడుదలకానుందనగా, ఓ వ్యక్తి కోర్టులో కేసు వేశారు. ఆ వ్యక్తి పేరు విపిన్ త్యాగి. ఈ టైటిల్‌ను తీసి వేయాలని, దేశ భక్తుల మనోభావాలను కించపరిచేలా టైటిల్ ఉందని, సల్మాన్ రీల్ నేమ్‌తో, భారత్‌ను పోల్చడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఢిల్లీ హైకోర్టు ఈ విషయమై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి మరి. మరోవైపు ఇటీవల వరకు కూడా సినిమా యూనిట్ చిత్రాన్ని చాలా బాగా ప్రమోట్ చేసింది. పెద్ద సినిమాల విడుదల సందర్భంలో ఈ మధ్య చాలానే అడ్డంకులు ఏర్పడుతున్నాయి. `భారత్`విషయాన్ని ఆ దృష్టితో చూడాలా? లేకుంటే దేశభక్తి పాయింట్లో చూడాలా అనేది సర్వత్రా జరుగుతున్న చర్చ. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను సునీల్ నారంగ్ విడుదల చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com