రాజ్ త‌రుణ్‌కు ప్ల‌స్ అవుతారా?

  • IndiaGlitz, [Thursday,May 03 2018]

యువ క‌థానాయ‌కుడు రాజ్ తరుణ్ సినిమాలో తల్లి పాత్రలు చాలా ప్రభావం చూపిస్తాయి. ఒక విధంగా ఆ పాత్రలు రాజ్ తరుణ్ సినిమాల‌ విజయానికి క‌లిసొచ్చిన అంశంగా కూడా చెప్పుకోవచ్చు. గతంలో ‘ఉయ్యాలా జంపాలా’ సినిమాలో అనితా చౌదరి.. ‘కుమారి 21ఎఫ్’లో హేమ.. ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ చిత్రంలో సురేఖా వాణి.. ఇలా తెలుగు నటీమణులు  తల్లి పాత్రలు పోషించిన సినిమాల్లో రాజ్ త‌రుణ్‌కు సింహభాగం విజయాలు అందించాయి.

కాగా.. ఈ ఏడాది ఆరంభంలో విడుదలైన ‘రంగుల రాట్నం’ సినిమాలో తొలిసారి తమిళ నటి సితార.. రాజ్ తరుణ్‌కు తల్లి పాత్రలో నటించారు. సంక్రాంతి కానుక‌గా విడుద‌లైన ఈ సినిమా ఆశించినంత విజయాన్ని అందించలేదు. మళ్ళీ ఇప్పుడు విడుద‌ల‌కు సిద్ధ‌మైన‌ ‘రాజుగాడు’ సినిమాలోనూ మరోసారి సితార.. రాజ్ త‌రుణ్‌కు తల్లి పాత్రలో నటించారు. మరి ఈ సినిమాతో ఎలాగైనా విజయం సాధించాలని భావిస్తున్న రాజ్ తరుణ్‌కు.. సితార ఎంత వరకు కలిసొస్తారో చూడాలి.

More News

'జంబల‌కిడిపంబ‌' లో అదిరిపోయే కాన్సెప్ట్ - హీరో నాని

శ్రీనివాస్‌రెడ్డి, సిద్ధి ఇద్నాని హీరో హీరోయిన్లుగా శివం సెల్యూలాయిడ్స్‌, మెయిన్ లైన్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్స్‌పై జె.బి.ముర‌ళీ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ర‌వి

శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న 'బంగారి బాలరాజు'

నంది క్రియేషన్స్ పతాకం పై రాఘవ్, కరోణ్య కత్రిన్ హీరో హీరోయిన్ లు గా పరిచయం చేస్తు కె.యండి. రఫీ. రెడ్డెం రాఘవేంద్ర రెడ్డి నిర్మాతలుగా కోటేంద్ర దుద్యాల దర్శకుడిగా పరిచయం

ఎక్స్ ఎల్ సినిమా సరికొత్త టెక్నాల‌జి తో 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా'

ఈ స‌మ్మ‌ర్ చిత్రాల్లో భారీ అంచనాలతో మే 4న విడుదలౌతున్న స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్  న‌టించిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా కి  సాంకేతికపరమైన అదనపు హంగులు తోడయ్యాయి.

మ‌హేష్ సినిమాలాగే బ‌న్నీ సినిమాలో కూడా..

ఈ వేస‌వి టాలీవుడ్‌కు బాగానే క‌లిసొచ్చింద‌నే చెప్పాలి. ‘రంగస్థలం’, ‘భరత్ అనే నేను’..

మెహ‌రీన్‌.. ఈ ఏడాది కూడా అలాగే

‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ (2016) చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైన‌ మెహరీన్..