TDP:ఎన్డీఏలో టీడీపీ చేరడం ఖాయం.. అధికారిక ప్రకటన ఎప్పుడంటే..?

  • IndiaGlitz, [Friday,March 01 2024]

ఎన్నికల వేళ ఏపీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఊహించినట్లుగానే 2014 ఎన్నికల సీన్ రిపీట్ కానుంది. తెలుగుదేశం-జనసేన-బీజేపీ కలిసి ఎన్నికల బరిలో దిగనున్నాయి. ఇప్పటికే టీడీపీ-జనసేన పొత్తు కట్టగా.. ఎట్టకేలకు బీజేపీ కూడా ఇప్పుడు జత కట్టనుంది. ఎన్డీఏ(NDA)లో తెలుగుదేశం పార్టీ చేరినట్లు శనివారం అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. ఎన్డీఏలోకి తెలుగుదేశం చేరిన విషయాన్ని ప్రకటించిన వెంటనే చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలను కలవనున్నారని తెలుస్తోంది. మరో 10 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నందున ముందుగా అభ్యర్థులను ప్రకటించేసి ప్రచారంలో దిగాలని మూడు పార్టీలు భావిస్తున్నాయి.

ఈ క్రమంలోనే మార్చి 4వ తేదీన సీట్ల ప్రకటన కూడా చేయనున్నారు. ఇప్పటికే టీడీపీ-జనసేన కలిసి 118 సీట్లను అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో టీడీపీ 94 సీట్లు, జనసేనకు 24 సీట్లు కేటాయించారు. తెలుగుదేశం పార్టీ 94 సీట్లకు అభ్యర్థులను ప్రకటించగా.. జనసేన మాత్రం 5 స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించగా.. 19 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. బీజేపీతో పొత్తు కుదిరాక ఆ పార్టీ కోరే స్థానాలు కాకుండా మిగిలిన స్థానాల్లో అభ్యర్థులను వెల్లడించనున్నారు. అయితే మిగిలిన 57 సీట్లలో టీడీపీ-బీజేపీ మాత్రమే పంచుకోనున్నాయి.

ఈ ఎన్నికల్లో 400 ఎంపీ సీట్లు గెలవాలనే లక్ష్యంగా బీజేపీ పెట్టుకోవడంతో.. ఎంపీ సీట్లను ఎక్కువ తీసుకోనుంది. ఇప్పటికే ఓ నిర్ణయానికి కూడా వచ్చినట్లుగా చెబుతున్నారు. ఇందులో బీజేపీకి 5 లోక్‌సభ, 9 అసెంబ్లీ సీట్లను కేటాయించనున్నట్లు సమాచారం. అరకు, తిరుపతి, హిందూపురం, కర్నూలు, రాజమండ్రి లేదా ఏలూరు ఎంపీ స్థానాలను బీజేపీకి కేటాయించేందుకు అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సీట్ల విషయానికి వస్తే.. శ్రీకాకుళం, విశాఖ ఉత్తరం, మాడుగుల, నర్సాపురం, ధర్మవరం, జమ్మలమడుగు, మదనప, తిరుపతి, పాడేరు, కైకలూరు, నర్సరావుపేట స్థానాలను ఇవ్వనున్నారు.

కాగా 2014లో కలిసి పోటీ చేసిన మూడు పార్టీలు వివిధ కారణాల వల్ల విడిపోయాయి. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంపై పోరాటంతో టీడీపీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేశారు. అనంతరం జనసేన కూడా టీడీపీకి దూరమైంది. ఈ నేపథ్యంలోనే 2019 ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసి ఘోర పరాజయం చవిచూశాయి. దీంతో కేంద్రంలోని బీజేపీతో కలిసేందుకు చంద్రబాబు-పవన్ ప్రయత్నాలు ప్రారంభించారు. ముందుగా జనసేన పార్టీ తిరిగి ఎన్డీఏలోకి చేరింది. అయితే చంద్రబాబు కూడా ఎన్డీఏలో చేరేందుకు తన వంతు ప్రయత్నాలు చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. మొత్తానికి చంద్రబాబు-పవన్ ప్రయత్నాలు ఫలించి వీరితో జత కట్టేందుకు బీజేపీ పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు

 

 

More News

Niharika:‘సాగు’వంటి మంచి కాన్సెప్ట్ సినిమాలను అందరూ ప్రోత్సహించాలి: నిహారిక కొణిదెల

వంశీ తుమ్మల, హారిక బల్ల ప్రధాన పాత్రలుగా సాగు అనే ఓ ఇండిపెండెంట్ ఫిల్మ్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.

PM Surya Ghar Yojana: కోటి ఇళ్లకు కరెంట్ ఫ్రీ.. సూర్యఘర్ స్కీమ్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం..

దేశ ప్రజలకు లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. దేశంలో సౌర విద్యుత్‌ వినియోగాన్ని మరింత పెంచి సామాన్య ప్రజలపై కరెంట్ ఛార్జీల భారం తగ్గించేలా తీసుకొచ్చిన ప్రధాని

Pawan Kalyan: ఫ్రస్ట్రేషన్‌లో పవన్ కల్యాణ్‌.. బాబు మెప్పు కోసం పూనకాలతో ఊగిపోతూ..

తాడేపల్లిగూడెం జెండా సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ఆవేశంగా ఊగిపోతూ సీఎం జగన్‌పై విరుచుకుపడుతూ రెచ్చిపోయారు. ఇది చూసిన కొంతమంది జనసైనికులు ఆహో ఓహో అంటూ ఎగిరి గంతెలేస్తున్నారు

KTR: మల్కాజిగిరిలో తేల్చుకుందాం రా.. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఛాలెంజ్‌..

ఒక్క ఎంపీ సీటు అయినా గెలిచి చూపించాలని సీఎం రేవంత్‌రెడ్డి విసిరిన సవాల్‌కు మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. రేవంత్‌కు దమ్ముంటే సీఎం పదవితో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని..

Nagababu:నా మాటలకు ఎవరైనా నొచ్చుకుంటే క్షమించండి: నాగబాబు

మెగా బ్రదర్ నాగబాబు (Naga Babu) ఇటీవల జరిగిన ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’(Operation Valentine) ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో