Telangana BJP: గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగరనుందా..? కనీసం పోటీలో అయినా నిలుస్తుందా..?

  • IndiaGlitz, [Tuesday,October 10 2023]

రాష్ట్రంలో ఎన్నికల హీట్ పెరగడంతో బీజేపీ ప్రచారంలో దూసుకుపోతుంది. ఇప్పటికే ప్రధాని మోదీ రెండు రోజుల వ్యవధిలోనే రెండు సార్లు ప్రచారం చేయడంతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కూడా రాష్ట్రంలో పర్యటనలు చేయడంతో ఎన్నికల యుద్ధానికి కమలం పెద్దలు కాలు దువ్వారు. వచ్చే ఎన్నికల్లో కాషాయం జెండా ఎగరేయాలని క్యాడర్‌కు దిశానిర్దేశం చేస్తు్న్నారు. అయితే రాష్ట్ర బీజేపీ నేతల్లో మాత్రం ఐక్యత కొరవడింది. విభేదాలతో ఆ పార్టీ కొంత వెనకంజలో పడింది. బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షడిగా ఉన్న సమయంలో బీజేపీలో ఫుల్ జోష్ నెలకొంది. సీఎం కేసీఆర్ కుటుంబసభ్యుల విమర్శలకు తనదైన శైలిలో విమర్శలు చేస్తూ క్యాడర్‌లో ఆత్మవిశ్వాసం నింపారు.

సంజయ్ నేతృత్వంలో బలంగా పుంజుకున్న బీజేపీ..

సంజయ్ నేతృత్వంలోనే గ్రేటర్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలతో పాటు ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ బలంగా పుంజుకుంంది. దుబ్బాక, హుజురాబాద్ బై ఎలక్షన్స్‌లో విజయ దుందుభి మోగించగా.. మునుగోడులో గట్టి పోటీ ఇచ్చి ఓడిపోయింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 48 స్థానాలు గెలుచుకుని గులాబీ పార్టీకి గట్టి పోటీ ఇచ్చింది. దీంతో తెలంగాణలో కేసీఆర్‌ పార్టీకి బీజేపీ మాత్రమే పోటీ ఇవ్వగలదని జనాల్లోకి బలంగా వెళ్లిపోయింది. అయితే కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణ బీజేపీని ఘోరంగా దెబ్బకొట్టాయి.

సంజయ్‌ను తప్పించి.. కిషన్ రెడ్డికి బాధ్యతలు ఇవ్వడం మైనస్..

అదే సమయంలో బీజేపీకి బలం తెచ్చిన బండి సంజయ్‌ను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించి కిషన్‌ రెడ్డికి అప్పగించడం కూడా కమలం పార్టీకి చాలా మైనస్ అయింది. దీంతో క్యాడర్‌లో నైరాశ్యం నెలకొంది. మరోవైపు సీనియర్ నేతల మధ్య విభేదాలు నెలకొన్నాయి. తమకు పార్టీలో సరైన ప్రాధాన్యత దక్కడం లేదంటూ కొంత మంది నేతలు అలకబూనారు. కనీసం కేంద్ర పెద్దలు వచ్చిన బహిరంగ సభలకు కూడా హాజరుకాలేదు. ఓ వైపు అధ్యక్షుడి మార్పు.. మరోవైపు సీనియర్ నేతల మధ్య విభేదాలతో ఎన్నికల రేసులో పార్టీ వెనకబడిపోయింది.

బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనన్న అనుమానాలకు బలం ఇచ్చిన మోదీ వ్యాఖ్యలు..

ఇదిలా ఉంటే ఇటీవల ప్రధాని నిజామాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు కేసీఆర్ ఎన్డీఏలో చేరతానని తనను రిక్వెస్ట్ చేశారని తెలిపారు. ఈ క్రమంలో బీజేపీకి బీఆర్ఎస్ టీం అని కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలకు బలం చేకూరినట్లైంది. అలాగే ప్రజల్లో కూడా బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనన్న అనుమానాలు నెలకొన్నాయి. బీఆర్ఎస్‌ పార్టీకి తామే ప్రత్యామ్నాయం అని అధికారంలోకి వచ్చేది తామేనని కమలం నేతలు పైకి గాంభీర్యంగా కనబడుతున్నా బీజేపీ గెలవడం కష్టమనే భావనలో ఉన్నారు. మంచి ఊపు మీదున్న బండి సంజయ్‌ని అధ్యక్షుడి పదవి నుంచి తప్పించి పెద్ద తప్పిదం చేసిందని ద్వితీయ శ్రేణి నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంజయ్ నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్లి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని చెబుతున్నారు. మొత్తానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను ఎదుర్కొని ఎన్నికల్లో ఏ మాత్రం ప్రభావం చూపిస్తుందో తెలియాలంటే ఫలితాలు వెలువడే రోజు డిసెంబర్ 3 వరకు ఆగాల్సిందే.

More News

Nassar:తమిళ సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు నాజర్ తండ్రి కన్నుమూత

తమిళ సినీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. తమిళ సీనియర్ నటుడు నాజర్ తండ్రి మెహబూబ్ బాషా(95) తుది శ్వాస విడిచారు.

YS Jagan: చంద్రబాబు అరెస్టుపై జగన్ వ్యాఖ్యలు వ్యూహమా..? బీజేపీని ఇరికించే ప్రయత్నమా..?

విజయవాడలో సోమవారం జరిగిన వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు అంశంపై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌గా మారాయి.

Telangana Congress: కాంగ్రెస్ ఈసారైనా అధికారంలోకి వస్తుందా..? కేసీఆర్‌ను ఢీ కొడుతుందా..?

రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కడంతో కాంగ్రెస్ పార్టీ కూడా దూకుడు పెంచింది. త్వరలోనే అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడింది. ఇప్పటికే ఆరు గ్యారంటీ హామీలతో జోష్ మీదున్న

BRS: బీఆర్ఎస్ ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తుందా..? సెంచరీ కొడుతుందా..?

తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాష్ట్రంలో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకుంది. గెలుపే లక్ష్యంగా పార్టీలు వ్యూహరచనలతో దూసుకుపోతున్నాయి.

YS Jagan: సత్ఫలితాలను ఇస్తున్న జగనన్న విద్యా సంస్కరణలు.. ఇది బాధ్యతాయుతమైన పాలన అంటే..

గ్రామంలోని స్కూలుకు వెళ్లి చదువుకోడం, ఇంటికి వెళ్లడం ఇదే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థుల పరిస్థితి. కనీసం పట్టణం వెళ్లడమే ఎంతో కష్టం అనుకునే