బయోపిక్.. దర్శకుడు కూడా బాలయ్యేనా?
Send us your feedback to audioarticles@vaarta.com
మహానటుడు స్వర్గీయ ఎన్.టి.రామారావు జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం యన్.టి.ఆర్.` ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ టైటిల్ రోల్‌లో నటించడమే కాకుండా నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. ఇదిలా వుంటే.. ఈ సినిమాకి సంబంధించి బాలకృష్ణ.. దర్శకుడు తేజ వ్యవహారంలో కొంత అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ మినహాయిస్తే.. ఇప్పటికీ ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. దీనికి తోడు తేజ కొత్త నటీనటులనీ, టెక్నాలజీ అనీ.. అనవసరమైన కాలయాపన చేస్తుండడంతో బాలకృష్ట కొంత గుర్రుగానే ఉన్నారని టాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
అంతేగాకుండా.. వెంకటేష్ సినిమాపైనే తేజ దృష్టిపెట్టడంతో.. యన్.టి.ఆర్` సినిమా చిత్రీకరణ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉండడంతో.. తేజపై బాలయ్య అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారని సన్నిహిత వర్గాలు వెల్లడిస్తున్నాయి. అందుకే ఈ చిత్రాన్ని బాలయ్యే డైరెక్ట్ చేసే ఆలోచనలో ఉన్నారని కూడా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇదిలా వుంటే.. గతంలో కూడా బాలకృష్ణ నర్తనశాల` సినిమాకి దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. అయితే, ఆ సినిమా షూటింగులో ఉన్నప్పుడే నటి సౌందర్య చనిపోవడంతో పాటు మరికొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. మరి బాలయ్య ఈసారైనా తన దర్శకత్వ కలను నెరవేర్చుకుంటారేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com