జనసేనలోని ‘ఒకే ఒక్కడు’ జంప్ అవుతాడా!?
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో జనసేన తరఫున గెలిచిన ‘ఒకే ఒక్కడు’ జంప్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారా..? ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలవడం వెనుక ఆంతర్యమేంటి..? అసలు ఈ భేటీ వెనుక అర్థం పరమార్థమేంటి..? అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే వైసీపీ తీర్థం పుచ్చుకోవాలని భావిస్తున్నారా..? అంటే తాజా పరిస్థితులను బట్టి చూస్తే ఇదే నిజమనిపిస్తోంది.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి జనసేన పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్‌ను మర్యాదపూర్వకంగా పలకరించి, అభినందనలు తెలిపారు. ఆయనతో సీఎం జగన్ కొద్దిసేపు మాట్లాడి అనంతరం సభలోకి వెళ్లిపోయారు. దీంతో జనసేన ఎమ్మెల్యే జంప్ అవుతాడా..? దాదాపు జంప్ అయిపోయినట్లే అని పెద్ద ఎత్తున కథనాలు రాసేస్తున్నారు. వాస్తవానికి ఎన్నికల ఫలితాల మరుసటి రోజు నుంచి జనసేన తరఫున పోటీచేసి కొందరు అభ్యర్థులు అడ్రస్ లేకుండా పోగా.. ద్వితియశ్రేణి నేతలు భారీ ఎత్తున అటు వైసీపీ.. ఇటు బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఇటీవలే మాజీ మంత్రి, జనసేన కీలకనేత రావెల కిశోర్ రాజీనామా చేసి కమలం గూటికి వెళ్లడానికి సిద్ధపడిన విషయం తెలిసిందే. దీంతో తాజాగా జగన్‌తో భేటీ అయిన రాపాక విషయంలోనూ అటు జనసేన.. ఇటు వైసీపీ శ్రేణులు సైతం ఇదే అనుకున్నారు.
నేను పూర్తిగా సహకరిస్తా..!
వైఎస్ జగన్‌తో భేటీ అనంతరం ఎమ్మెల్యే వరప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ... మంత్రివర్గ విస్తరణలో సీఎం వైఎస్ జగన్ సామాజిక న్యాయం పాటించారని ప్రశంసల వర్షం కురిపించారు. జగన్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటే పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పుకొచ్చారు. శాసనసభలో జనసేన వాణిని వినిపిస్తానని.. తాను వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ నుంచి విజయం సాధించానని, ప్రస్తుతం ఆయన తనయుడు జగన్ సీఎంగా ఉన్నప్పుడు మరోసారి శాసనసభలో అడుగు పెడుతున్నానని తెలిపారు. జనసేన పార్టీ శాసనసభలో నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉంటుందని వరప్రసాద్ తెలిపారు. కాగా.. ఎన్నికల ఫలితాల అనంతరం జనసేన పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే వైసీపీలో చేరబోతున్నారనే ఊహాగానాలు పెద్ద ఎత్తున వచ్చాయి. అయితే తాను జనసేనలోనే ఉంటానని ఇటీవలే వరప్రసాద్ స్పష్టం చేసిన విషయం విదితమే.
జంప్ అయిన వైసీపీ తీసుకోదేమో..!
ఏపీలోని మొత్తం 175 నియోజకవర్గాల్లో 151 స్థానాల్లో కనివినీ ఎరుగని రీతిలో ఎమ్మెల్యేలను గెలుచుకున్న వైసీపీకి ప్రస్తుతం ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలను తీసుకోదు.. తీసుకునే సాహసం చేయదు కూడా. వచ్చే ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి..? మళ్లీ ఉపఎన్నికలు ఇదంతా పెద్ద తతంగమే. కాబట్టి బహుశా అటు టీడీపీ కానీ.. ఇటు ఏకైక ఎమ్మెల్యే రాపాక కానీ బీజేపీలాంటి పార్టీల్లోకి వెళ్లడానికి యత్నిస్తారేమో గానీ.. వైసీపీలోకి వెళ్లడానికి మాత్రం ప్రస్తుతానికి సాహసించరని చెప్పుకోవచ్చు.
ఇంతకీ ఎవరీ వన్ అండ్ ఓన్లీ..!
కాగా.. అసెంబ్లీలో జనసేన పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. ఈ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండుసార్లు పోటీచేసినప్పటికీ గెలవకలేకపోవడం గమనార్హం. కాగా.. రాపాక తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం నుంచి పోటీచేసి వైసీపీ అభ్యర్థి, టీడీపీ అభ్యర్థులపై పోరాడి 814 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలుపొందారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com