గోపీచంద్‌కు ఆ తేది మరోసారి కలిసొస్తుందా?
Send us your feedback to audioarticles@vaarta.com
యాక్షన్ చిత్రాల కథానాయకుడు గోపీచంద్ నటిస్తున్న 25వ చిత్రం 'పంతం'. మెహరీన్ నాయిక. ఈ చిత్రంతో కె.చక్రవర్తి (చక్రి) దర్శకుడిగా పరిచయం కానున్నారు. ముందుగా మే 18న చిత్రాన్ని విడుదల చేయాలని భావించారు. కాని కొన్ని కారణాల వల్ల వాయిదా పడిన ఈ సినిమా.. ఇప్పుడు జూలై 5న విడుదలకు ముస్తాబవుతోంది.
జూలై నెలలో గోపీచంద్ కెరీర్లో మంచి విజయాలే ఉన్నాయి. ఆ వివరాల్లోకి వెళితే.. గోపీచంద్ హీరోగా ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'యజ్ఞం'. 2004లో జూలై 2న విడుదలైన ఈ సినిమాతో హీరోగా తొలి విజయాన్ని అందుకున్నారు గోపీచంద్. అంతేగాకుండా.. గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్ జట్టుగా తెరకెక్కిన 'లక్ష్యం' (2007) కూడా ఇదే నెలలో అంటే జూలై 5న విడుదలై గోపీచంద్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.
అలాగే.. చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్లో రూపొందిన ప్రయోగాత్మక చిత్రం 'సాహసం'(2013). జూలై 12న విడుదలైన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అదేవిధంగా.. సంపత్ నంది దర్శకుడుగా తెరకెక్కిన 'గౌతమ్ నంద' కూడా గతేడాది జూలై 28న విడుదలైంది.
కాకపోతే.. ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. మొత్తమ్మీద.. ఈ నెలలో మూడు సార్లు విజయాలను అందుకున్న గోపీచంద్.. ఇప్పుడు తన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన తేదీ (జూలై 5)న 'పంతం'తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మరి 'లక్ష్యం' ఫలితాన్ని 'పంతం' కూడా రిపీట్ చేస్తుందేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments