తేజ హీరోయిన్ కి కలిసొస్తాయా?
Send us your feedback to audioarticles@vaarta.com
సంచలన దర్శకుడు తేజ దర్శకత్వంలో రూపొందిన 2012 నాటి చిత్రం నీకు నాకు. ఈ చిత్రంతో హీరోయిన్గా పరిచయమైన నందితకి.. ఆ సినిమా ఆశించిన విజయాన్ని ఇవ్వకపోయినా.. ప్రేమకథా చిత్రమ్ ఆఫర్ రావడానికి కారణమయ్యింది. రెండో చిత్రం బ్లాక్‌బస్టర్ కావడంతో నందితకి ఒక్కసారిగా క్రేజ్ పెరిగింది. అయితే.. ఆ క్రేజ్‌ని సరిగ్గా వాడుకోలేకపోయింది నందిత. ఆ తరువాత ఆమె చేసిన సినిమాల్లో లవర్స్ మినహాయిస్తే మరో హిట్ లేదు.
ఇదిలా ఉంటే.. ఈ ముద్దుగుమ్మ నటించిన రెండు సినిమాలు వారం గ్యాప్‌లో రిలీజ్‌కి రెడీ అయ్యాయి. అయితే ఆ రెండు చిత్రాల్లో ఆమెది లీడింగ్ రోల్ అయితే కాదు. నారా రోహిత్‌తో కలిసి నటించిన కథలో రాజకుమారి ఈ నెల 15న విడుదల కానుండగా.. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన జైలవకుశ ఈ నెల 21న విడుదల కానుంది. ఈ రెండు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించిన నందితకి అవి ఏ మాత్రం ఉపయోగపడతాయో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com