తేజ హీరోయిన్ కి కలిసొస్తాయా?

  • IndiaGlitz, [Tuesday,September 12 2017]

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు తేజ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన 2012 నాటి చిత్రం నీకు నాకు. ఈ చిత్రంతో హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మైన నందిత‌కి.. ఆ సినిమా ఆశించిన విజ‌యాన్ని ఇవ్వ‌క‌పోయినా.. ప్రేమ‌క‌థా చిత్ర‌మ్ ఆఫ‌ర్ రావ‌డానికి కార‌ణ‌మ‌య్యింది. రెండో చిత్రం బ్లాక్‌బ‌స్ట‌ర్ కావ‌డంతో నందితకి ఒక్క‌సారిగా క్రేజ్ పెరిగింది. అయితే.. ఆ క్రేజ్‌ని స‌రిగ్గా వాడుకోలేక‌పోయింది నందిత‌. ఆ త‌రువాత ఆమె చేసిన సినిమాల్లో ల‌వ‌ర్స్ మిన‌హాయిస్తే మ‌రో హిట్ లేదు.

ఇదిలా ఉంటే.. ఈ ముద్దుగుమ్మ న‌టించిన రెండు సినిమాలు వారం గ్యాప్‌లో రిలీజ్‌కి రెడీ అయ్యాయి. అయితే ఆ రెండు చిత్రాల్లో ఆమెది లీడింగ్ రోల్ అయితే కాదు. నారా రోహిత్‌తో క‌లిసి న‌టించిన క‌థ‌లో రాజ‌కుమారి ఈ నెల 15న విడుద‌ల కానుండ‌గా.. ఎన్టీఆర్ త్రిపాత్రాభిన‌యం చేసిన జైల‌వ‌కుశ ఈ నెల 21న విడుద‌ల కానుంది. ఈ రెండు చిత్రాల్లో కీల‌క పాత్ర‌లు పోషించిన నందిత‌కి అవి ఏ మాత్రం ఉప‌యోగ‌ప‌డ‌తాయో చూడాలి.