త‌మ‌న్నా కోరిక నెర‌వేరుతుందా

  • IndiaGlitz, [Wednesday,June 12 2019]

త‌మ‌న్నాని చూసిన చాలా మంది డ్యాన్సుల్లో శ్రీదేవికి స‌రిజోడీ ఈ కాలంలో త‌మ‌న్నానే అని అంటారు. ఫ్లోర్ మీద స్లిమ్‌గా స్టెప్పులేయ‌డంలో ఈ మిల్కీ బ్యూటీ ఆ అతిలోక సుంద‌రిని త‌ల‌పించింది మ‌రి. అలాంటి త‌మన్నా మ‌న‌సులో ఉన్న కోరిక కూడా అక్ష‌రాలా అతిలోక సుంద‌రికి సంబంధించిందే.

అతిలోక సుంద‌రి శ్రీదేవి జీవిత‌గాథ‌తో సినిమా తెర‌కెక్కితే, అందులో తాను న‌టించాల‌న్న‌దే త‌మ‌న్నా సంక‌ల్పం. అయితే ఆమెకు ఆ ఛాన్స్ ఇప్ప‌టిదాకా రాలేదు. ఆ మ‌ధ్య ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు చిత్రంలోనూ శ్రీదేవి పాత్ర‌లో త‌మ‌న్నా మెరుస్తార‌ని చాలా మంది ఎక్స్ పెక్ట్ చేశారు.

అయితే అనుకోని విధంగా ఆ అవ‌కాశం ఎక్స‌ర్‌సైజ్ స్టార్ ర‌కుల్‌ప్రీత్‌సింగ్‌ను వ‌రించింది. ఆ త‌ర్వాత కూడా ఒక‌ట్రెండు సార్లు శ్రీదేవి బ‌యోపిక్‌ల ప్ర‌స్తావ‌న వ‌చ్చిన‌ప్ప‌టికీ అందులో త‌మ‌న్నా పేరు మాత్రం లేదు. అందుకే ఎవ‌రూ త‌న‌ను గురించి ప‌ట్టించుకోవ‌ట్లేదు.. అని అనుకున్న‌దో ఏమోగానీ, త‌మ‌న్నా ఏకంగా త‌న మ‌న‌సులోని మాట‌ను బ‌య‌ట పెట్టేసింది.

తెలుగులో ద‌టీజ్ మ‌హాల‌క్ష్మి, సైరా చిత్రాల‌తో త‌మ‌న్నా బిజీ. త‌మిళంలో కొన్ని సినిమాలున్నాయి. ప్ర‌భుదేవా స‌ర‌స‌న న‌టించిన హిందీ ఖామోషీ విడుద‌లకు సిద్ధ‌మ‌వుతోంది. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏంటంటే త‌మ‌న్నా అత్యంత గొప్ప‌గా అభిమానించే న‌టి కూడా శ్రీదేవి అట‌. ఈ విష‌యాన్ని ఆమే స్వ‌యంగా వెల్ల‌డించింది