టబు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?
Send us your feedback to audioarticles@vaarta.com
త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా అంటే సీనియర్ నాయికలు ఎవరూ అంత తేలిగ్గా వదులుకోరు. అలాగని మరీ తల్లి పాత్రలకు, అత్త పాత్రలకు ఓకే చెప్పేయాలన్న కాసింత తటపటాయించాల్సిందే. ఇప్పుడు టబు పరిస్థితి అచ్చం అలాగే ఉంటుందేమో. నిన్నే పెళ్లాడుతా టబు ఇప్పటికీ ఎంతో మందికి కలలరాణి. ఆ మధ్య రాఘవేంద్రరావు `పాండు రంగ మహాత్య్మం`లో ఓ మంచి పాత్ర చేసింది. ఆ తర్వాత ఆమె నటించిన డైరక్ట్ తెలుగు సినిమాలు లేవు.
అయితే ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ హీరోగా నటించే సినిమా కోసం ఆమెను అప్రోచ్ కానున్నారట. మొన్నటిదాకా బన్నీ తల్లి పాత్రకు నగ్మ పేరు వినిపించింది. అయితే తననెవరూ సంప్రదించడం లేదని ఆమె తెగేసి చెప్పడంతో ఇప్పుడు టబు గురించి వార్తలు వస్తున్నాయి. త్రివిక్రమ్ ఆ తల్లి కేరక్టర్‌ను ఎంత హుందాగా, స్ట్రాంగ్‌గా తీర్చిదిద్దారో, దాన్ని టబు చేయడానికి ఇష్టపడతారో, లేదో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments