ఈ సారైనా విజ‌యం ద‌క్కేనా?

  • IndiaGlitz, [Sunday,April 15 2018]

యూత్‌ఫుల్ చిత్రాల దర్శకుడు ఎ.కరుణాకరన్ దర్శకత్వంలో మెగాహీరో సాయిధరమ్ తేజ్, కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘తేజ్‌ ది కూడా ఓ మంచి ప్రేమ కథ’ (ప్రచారంలో ఉన్న పేరు). శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని.. యూత్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యే విధంగా దర్శకుడు తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఈ సినిమాని క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్‌ పతాకంపై కె.ఎస్.రామారావు నిర్మిస్తున్నారు. కరుణాకరన్, కె.ఎస్.రామారావు కాంబినేషన్‌లో ఇది రెండో చిత్రం కావడం విశేషం. 

గతంలో వీరి కలయికలో విక్టరీ వెంకటేష్, భూమిక జంటగా నటించిన ‘వాసు’ (2002) సినిమా వ‌చ్చింది. అలరించే పాటలతో, బ్యూటీఫుల్ లవ్‌స్టోరీతో పాటు.. మంచి కుటుంబ కథా చిత్రంగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టుకున్నా.. ఆశించిన విజయాన్నైతే అందించలేదు. మ‌ళ్ళీ 16 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత  కరుణాకరన్, కె.ఎస్.రామారావు కాంబినేషన్ తెరపైకి వచ్చింది.  జూన్‌లో విడుదల కాబోయే ఈ చిత్ర‌మైనా వీరికి విజయాన్ని అందిస్తుందో లేదో చూడాలి.

More News

'సైరా నరసింహా రెడ్డి' కోసం రెండోసారి..

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘సైరా నరసింహా రెడ్డి’.

పూరి జగన్నాథ్‌ కెరీర్‌లో 'మెహబూబా' వన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ మూవీ అవుతుంది - నిర్మాత దిల్‌ రాజు

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ తన తనయుడు ఆకాష్‌ పూరిని హీరోగా పరిచయం చేస్తూ పూరి జగన్నాథ్‌

'మహానటి' టీజర్ మరియు కీర్తి సురేష్ ఫస్ట్ లుక్ విడుదల

తెలుగు చలన చిత్ర చరిత్రలో సావిత్రి గారి స్థానం అమరం.

కింగ్‌ నాగార్జున సరసన ఆకాంక్ష సింగ్‌

కింగ్‌ నాగార్జున, నేచురల్‌ స్టార్‌ నాని హీరోలుగా వైజయంతి మూవీస్‌ పతాకంపై టి.శ్రీరామ్‌ఆదిత్య దర్శకత్వంలో అగ్ర నిర్మాత సి.అశ్వనీదత్‌ భారీ మల్టీస్టారర్‌ నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

'జంబ‌ల‌కిడి పంబ‌' ఫ‌స్ట్ లుక్ లాంచ్ చేసిన డా.వి.కె.న‌రేశ్‌!

'జంబ‌ల‌కిడి పంబ‌' అనే పేరు విన‌గానే న‌రేశ్ హీరోగా ఈవీవీ స‌త్య‌నారాయ‌ణ చేసిన న‌వ్వుల సంద‌డి గుర్తుకొస్తుంది.