ఈ వారమైనా భజన ఆపుతారా?
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ సీజన్ 4 ప్రారంభమైన తొలి వారం ఈ షో ఏంటి? అసలు ముక్కూ మొహం తెలియని వ్యక్తులను తీసుకొచ్చి పెట్టి వీళ్లేం సాధించాలని అనుకుంటున్నారు? అనిపించింది. ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. నిర్వాహకుల ఎంపిక సరైనదేనని అనిపించింది. చూస్తుండగానే నాలుగు వారాలు గడిచిపోయాయి. ఈ నాలుగు వారాల్లో కామన్‌గా ఉన్న పాయింట్ ఒక్కటే ఒక్కటి. గంగవ్వ భజన. ఆమె భజన చేస్తే తప్ప హౌస్‌లో ఉండలేమని కంటెస్టెంట్లు భావిస్తున్నారో.. ఏమో కానీ బీభత్సంగా భజన చేస్తున్నారు. తొలి వారంలో గంగవ్వ షోలో ఉంది అనగానే ప్రేక్షకులు అమితాసక్తిని ప్రదర్శించారు. అయితే మిగిలిన కంటెస్టెంట్ల కారణంగానో.. మరేంటో గానీ రాను.. రాను ఆమె బోర్ కొట్టిస్తున్నారనే మాటైతే బాగా వినిపిస్తోంది.
గంగవ్వను తీసుకున్న పర్పస్ ఏంటో అర్థం కావడం లేదు. ఒక్క 60 ఏళ్ల పై బడిన వారిని తమ షో వైపునకు తిప్పుకునే ప్రయత్నం అనుకుందామంటే.. ఆ ఏజ్ గ్రూప్ వాళ్లు ఎవరున్నా అంతగా ఆసక్తినైతే షోపై ప్రదర్శించరు. టాస్క్‌ల్లోనూ పెద్దగా గంగవ్వ పెర్ఫార్మెన్స్ కనిపించట్లేదు. ‘మనుషులు - రోబో టాస్క్‌లో గంగవ్వ రోబోల వైపు ఉన్నారు. రోబోలంతా ఆమెను ముందు పెట్టి గేమ్ ఆడటంతో మనుషులు అటాక్ చేసేందుకు సాహసించలేదు. ఆమెకేమైనా గాయలైతే తమకు ఎక్కడ ప్రేక్షకుల్లో వ్యతిరేకత వస్తుందోనని భయపడ్డారు. దీంతో ఆ టాస్క్లో ఉదయమంతా మనుషులు రోబోలను అటాక్ చేసేందుకు సంసిద్ధత చూపించలేదు.
ఇకపోతే ఫ్యాషన్ షోలో అద్భుతంగా ఉన్న అమ్మాయిలను పక్కనబెట్టి గంగవ్వకు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు. దీంతో ప్రేక్షకుల నుంచి చాలా వ్యతిరేకత వచ్చింది. ఆమె ఇంటికి ఏదైనా సాయం చేద్దామని భావిస్తే ఏదో ఒకరకంగా సాయం చేయాలి కానీ ఈ రకంగానా? అంటూ మండిపడుతున్నారు. మరోవైపు కంటెస్టెంట్లు కూడా గంగవ్వకు అంతలా ప్రాధాన్యమివ్వాల్సిన అవసరం ఏముందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. కనీసం నామినేషన్స్‌లో సైతం గంగవ్వ పేరు చెప్పేందుకు కంటెస్టెంట్లు భయపడుతున్నారు. మరీ ఇంత భజన ఆమెకు చేటు తెస్తుందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. అయితే గంగవ్వ గేమ్ చూస్తుంటే మాత్రం ఆమె చాలా తెలివిగా ఆడుతున్నట్టు మాత్రం అర్థమవుతోంది. ఇక వారాలు గడుస్తున్న కొద్దీ మరింత టఫ్ ఫైట్ ఇవ్వాల్సి వస్తుంది. మరి ఆమె అంత టఫ్ ఫైటును ఇవ్వగలరా? అనేది కూడా ప్రశ్నార్థకమే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments