ఆమెను తమన్ సింగర్‌గా మార్చేస్తున్నాడా?
Send us your feedback to audioarticles@vaarta.com
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తన సినిమాల్లో హీరో, హీరోయిన్‌లతో పాటలు పాడించేస్తుంటాడు. ఈ విషయం చాలా సినిమాల్లో రుజువైంది. కాగా మరోసారి తమన్ తన స్టైల్లో మరో అందాల భామను సింగర్‌గా మార్చేస్తున్నాడని వార్తలు వినపడుతున్నాయి. ఇంతకు ఆ ముద్దుగుమ్మ ఎవరో కాదు.. పూజా హెగ్డే. ఈ అమ్మడు ప్రస్తుతం బన్ని, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది.
ఈ చిత్రంలో ఓ సాంగ్‌ను పూజాతో పాడించాలని తమన్ అనుకుంటున్నాడట. నిజానికి పూజా హెగ్డేకు కూడా సింగర్‌గా మారాలని ఎప్పటి నుండో ఆశ. ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో కూడా చెప్పుకుంది. ఎట్టకేలకు ఆమె కోరికను తమన్ త్వరలోనే తీర్చేయబోతున్నాడన్నమాటేగా!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com