శ్రీకాంత్ అడ్డాల అధిగమించగలడా?
Send us your feedback to audioarticles@vaarta.com
'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' వంటి బ్లాక్‌బస్టర్ తరువాత మహేష్ బాబు, శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్లో వస్తున్న చిత్రం 'బ్రహ్మోత్సవం'. ఈ నెల 20న రానున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇదిలా ఉంటే.. మహేష్‌కి సంబంధించిన ఓ సెంటిమెంట్ శ్రీకాంత్ విషయంలోనూ కొనసాగుతుందా అనేది ఫిల్మ్ నగర్ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ అదేమిటంటే.. మహేష్‌తో తమ రెండో చిత్రాన్ని తీసి హిట్ కొట్టిన దర్శకుడే నాలుగో చిత్రాన్ని కూడా రూపొందిస్తే రిజల్ట్ మారుతుందన్నది.
ఇదివరకు మహేష్‌తో 'అతడు' రూపంలో తన రెండో చిత్రాన్ని చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్.. 'ఖలేజా'గా నాలుగో సినిమాని అదే మహేష్‌తో చేస్తే నెగెటివ్ రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు శ్రీకాంత్ అడ్డాలది కూడా ఇదే పరిస్థితి. మహేష్‌తో రెండో సినిమాని 'సీతమ్మ..'గా చేసిన అతడే నాలుగో చిత్రాన్ని 'బ్రహ్మోత్సవం'గా చేశాడు. మరి త్రివిక్రమ్ విషయంలో చోటుచేసుకున్న చేదు అనుభవాన్ని శ్రీకాంత్ అయినా అధిగమిస్తాడో లేదో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com