శ్రీను వైట్ల అప్పుడు మిస్ అయ్యాడు..మరి ఇప్పుడు..?
Send us your feedback to audioarticles@vaarta.com
శ్రీను వైట్ల అప్పుడు మిస్ అయ్యాడు..మరి ఇప్పుడు..? అనగానే మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న బ్రూస్ లీ చిత్రం గురించి అనుకుంటే పొరపాటే. మరి దేని గురించి అంటారా..? నాగచైతన్య రెండో చిత్రాన్ని శ్రీను వైట్లతో చేయాలనుకున్నారు. ఈ చిత్రాన్ని కామాక్షి ఆర్ట్స్ బ్యానర్ పై డి.శివప్రసాద్ రెడ్డి నిర్మించాలనుకున్నారు.అంతా కన్ ఫార్మ్ అయిపోయింది. మీడియాలో ఎనౌన్స్ మెంట్ కూడా వచ్చేసింది. కానీ ఆతర్వాత కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లలేదు.
మళ్లీ ఇప్పుడు విచిత్రంగా అఖిల్ రెండో సినిమాకి శ్రీను వైట్ల అయితేనే బాగుంటుంది అనుకుంటున్నారట. ప్రస్తుతం తొలి చిత్రం షూటింగ్ లో బజీగా ఉన్న అఖిల్ తన రెండో సినిమాని జనవరిలో ప్రారంభిస్తాడట. అయితే... అఖిల్ సెకండ్ మూవీ డైరెక్టర్స్ లిస్ట్ లో శ్రీను వైట్లతోపాటు పూరి జగన్నాధ్, కొరటాల శివ పేర్లు కూడా వినిపిస్తున్నాయి.మరి... నాగచైతన్య రెండో సినిమా మిస్ అయిన శ్రీను వైట్ల ఈసారి అఖిల్ రెండో సినిమా మిస్ కాకూడదనుకుంటున్నాడట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com