'సైజ్ జీరో' ఆ చిత్రంలా ఉంటుందా...?

  • IndiaGlitz, [Friday,August 14 2015]

అనుష్క ప్రధానపాత్రలో బాహుబలి', రుద్రమదే'వి చిత్రాల తర్వాత చేస్తున్న సినిమా సైజ్ జీరో'. పివిపి బ్యానర్ పై రూపొందుతోన్న ఈ చిత్రం కోసం అనుష్క ఇరవై కేజీల బరువు కూడా పెరిగి లావుగా తయారైంది. ఈ చిత్రంలో ఆర్య హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్ర ఆడియో సెప్టెంబర్ 6న విడుదలవుతుండగా, సినిమాని అక్టోబర్ 2న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ లెవల్ లో విడుదల చేయడానికి యూనిట్ ప్లాన్ చేస్తుంది.

ఈ రోజు ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజైంది. ఈ లుక్ లో ఓ మంచంపై ఆర్య, అనుష్క కూర్చొని ఉన్నారు. అందులో ఆర్య స్లిమ్ గా కనపడుతుంటే, అనుష్క బొద్దుగా కనపడుతుంది. ఈ లుక్ చూస్తుంటే రెండు సినిమాలు గుర్తుకు వస్తున్నాయి. అందులో ఒకటి కితకితలు కాగా, రెండో సినిమా బాలీవుడ్ కి చెందిన ధమ్ లగాకే హైసా. మరి ఈ చిత్రం ఎలా ఉంటుందో రేపు విడుదలైతే కానీ తెలియదు.