సిల్లీ పనులు చేస్తే సినిమాలు సక్సెస్ అవుతాయా!?
Send us your feedback to audioarticles@vaarta.com
సిల్లీ పనులు చేస్తే సినిమాలు సక్సెస్ అవుతాయా..? లేకుంటే సినిమాలో విషయం ఉంటే జనాలు థియేటర్లకు క్యూ కట్టి సూపర్ హిట్ చేస్తారా..? అనే విషయం టాలీవుడ్‌లోని కొందరు నటీనటులు.. ముఖ్యంగా దర్శకులకు అస్సలు తెలియట్లేదు. అందుకే ఏదో చేద్దామని ఇంకేదో చేసేసి.. అదేదో సామెత ఉంది కదా.. ‘ఎరుక్కపోయి ఇరుక్కుపోయినట్లు..’ ‘నాన్నా పులి అనే కథలాగా..’ అనే ప్రవర్తిస్తున్నారు. ఇందుకు చక్కటి ఉదాహరణ ‘ఇస్మార్ట్ శంకర్’.. ‘నిను వీడని నీడను నేనే’ చిత్ర బృందమే.
‘ఇస్మార్ట్ శంకర్’ విషయానికొస్తే..!
వాస్తవానికి డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఒకప్పుడు వేరు ఇప్పుడు వేరు.. అని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు పూరీ సినిమా అంటే చాలు థియేటర్లు జనాలు వారంతటవారే క్యూ కట్టేవారు. అయితే ఇప్పుడు మాత్రం వారిని క్యూ కట్టించేందుకు పూరీనే సినీ ప్రియులను తరుముతున్నారు. అదీ పరిస్థితి.. ఒక్క మాటలో చెప్పాలంటే బిజినెస్‌మెన్ ముందు.. ఆ తర్వాత పూరీని ఇప్పుడు సరిగ్గా లెక్కలేయలేం. అలాంటి ఎలా అయిపోయాడబ్బా అని ఆయన అభిమానులే ఒకింత తలలు పట్టుకుంటూ ఉంటారు. ఈయన తెరకెక్కించిన తాజా చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. ఈ సినిమాకు ఎక్కడ లేని పబ్లిసిటీ కల్పించి జనాల దృష్టిలో పడాలని నానా ప్రయత్నాలు చేస్తున్నారు.
అప్పట్లో ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ లీక్ అయ్యిందని పెద్ద ఎత్తునే హడావుడి జరిగింది. అయితే దీన్ని కాసింత లోతుగా వెళ్లి ఆలోచించగా సినీ ప్రమోషన్‌లో భాగమేనని తేలిపోయిందట. ఆ తర్వాత హైదరాబాద్‌లోని చార్మినార్ పరిధిలో చార్మినార్‌లో బహిరంగ ధూమపానం నిషేధించిన సంగతి తెలిసినప్పటికీ కావాల్సిందే అలా చేసి రూ. 200 జరిమానా చెల్లించి ఈ టైమ్‌లో కూడా వార్తల్లో నిలిచారు. తీరా చూస్తే ఇది పక్కా ప్లానేట. ఇదీ ఇస్మార్ట్ శంకర్ సినిమా పరిస్థితేంటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఈ రెండు సిల్లీ పనుల వల్ల పూరీ ఇమేజ్‌కు పెద్ద డ్యామేజే వచ్చిందని సినీ ప్రియులు, క్రిటిక్స్ చెవులు కొరుకుంటున్నారట.
‘నిను వీడని నేనే’ సినిమా విషయానికొస్తే..
ఈ సినిమా షూటింగ్ మొదలుకుని నిన్న మొన్నటి వరకూ ప్రతీసారి వార్తలే వార్తలు. ఈ సినిమాలో హీరోగా నటిస్తున్న సందీప్ కిషన్ షూటింగ్‌లో గాయపడటం, బాత్రూమ్‌లో పోస్టర్లు ఆ తర్వాత కమెడియన్ ప్రియదర్శి బైక్ పోయిందని హంగామా.. పోలీసులు రంగంలోకి దిగడం ఏం చేయాలో దిక్కుతోచక చిన్నపాటి సారీతో సర్ది చెప్పాలనుకోవడం.. అంటే అటు మీడియాను, ఇటు పోలీసులను ఎర్రోళ్లను చేయాలని ఇలా చేశారన్న మాట. అంటే మీడియా, పోలీసులతో చెలగాటమా..? అసలు ఇలాంటి పనులు ఏ మాత్రం సమంజసమో మరి.
ఆ ఇద్దరే కింగ్‌లు!
అయితే మొదట్లో సినిమా ప్రమోషన్ అంటే దానికో లెక్కుండేది.. అయితే ఇప్పుడు టెక్నాలజీ యుగం గనుక ఏదో ఒక రీతిన సినిమాను జనాలకు దృష్టికి తీసుకెళ్లొచ్చు. అయితే సిల్లీ పనులు చేయడం వల్ల ఒరిగిందేమైనా ఉందా..? అంటే పరువు పోగొట్టుకోవడం తప్ప ఏమీ ఉండదు. సినిమా ప్రమోషన్స్‌లో కింగ్‌లు ఎవరైనా ఉన్నారా అంటే మొదట గుర్తొచ్చేది రాజమౌళి, రామ్‌గోపాల్ వర్మ. బాహుబలి రెండు భాగాల్లో ఎలా సస్పెన్షన్‌కు తెరలేపాడో.. జనాల్లో ఏ రేంజ్‌లో అంచనాలు పెంచి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడమే కాకుండా తెలుగు ఖ్యానికి ప్రపంచానికి తెలియజేసిన వ్యక్తి జక్కన్న.
మరోవైపు ఆర్జీవీ.. ఈయన గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఒకటి అర ప్రెస్‌మీట్లు తప్ప పెద్దగా ఏమీ ఎంచుకోరు. ఆయనకున్న ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో ఆర్జీవీకి ప్రచార మాధ్యమాలు. ఇందుకు నిదర్శనం..ఆయన సినిమాల కోసం జనాలు థియేటర్లకు పరుగులు తీయడం. ఆ సినిమాలేంటి అనేది మరీ ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. సో.. కాస్త బుర్రపెడితే ఆలోచనలు వస్తాయ్ అంతేగానీ.. ఇలా సిల్లీగా ఆలోచించి నలుగురిలో నవ్వులపాలవ్వడం ఎంత వరకు సబబో.. ఇకనైనా మారితే అదే మార్పు మన మంచికే అన్నట్లుగా బాగుంటుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout