చిక్కిపోతున్న ‘చంద్రుడు’.. పెను ప్రమాదం తప్పదా!?
Send us your feedback to audioarticles@vaarta.com
చందమామ రోజురోజుకు చిక్కిపోతున్నాడు. అసలేం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి.. మున్ముంథు పెను ప్రమాదం తప్పదనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అసలు ఈ వ్యవహారం గురించి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఏం చెబుతోంది..? నాసా ఏం చేయబోతోంది..? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
క్రమంగా చంద్రుడు చిక్కిపోతున్నాడని.. ఇందుకు కారణం అంతర్గతంగా చల్లదనమేనని నాసా చెబుతోంది. అంతేకాదు మున్ముంథు చంద్రుడిపై ప్రకంపనలు వస్తున్నాయని నాసా ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటి వరకు మొత్తం 28 సార్లు ప్రకంపనలు వచ్చినట్లు నాసా గుర్తించింది. వంద మిలియన్ల సంవత్సరాల కాలంలో చంద్రుడు దాదాపు 150 అడుగుల కంటే ఎక్కువగా కుంచించుకుపోయాడని వెల్లడించింది. దీని కారణంగా చంద్రుని ఉపరితలం ముడుచుకుపోవడం, ప్రకంపనలు చోటు చేసుకోవడం లాంటి పరిణామాలు ఏర్పడతాయని నాసా పేర్కొంది.
కాగా.. నాసాకు చెందిన లూనార్ రీకానిసెన్స్ ఆర్బిటార్ తీసిన 12 వేల చంద్రుడి చిత్రాలను విశ్లేషించిన పరిశోధకులు ఈ షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. ఎండు ద్రాక్ష మాదిరిగా చంద్రుడు కుచించుకుపోయాడని నాసా పరిశోధకులు చెబుతున్నారు. ఇలా జరగడంతో భవిష్యత్తులో ఉపరితలంపై పగుళ్లు ఏర్పడే అవకాశం ఉందని.. స్పష్టమవుతోంది. మొత్తానికి చూస్తే భవిష్యత్తులో పెను ప్రమాదం సంభవించే అవకాశాలు మెండుగా ఉన్నాయని తేలిపోయిందన్న మాట.!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout