'యన్.టి.ఆర్' బయోపిక్‌కు ఓకే చెబుతుందా?
Send us your feedback to audioarticles@vaarta.com
మహానటుడు ఎన్టీఆర్ బయోపిక్‌ను 'యన్.టి.ఆర్' పేరుతో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి తేజ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోందీ చిత్రం.
ఈ పనుల్లో భాగంగా నటీనటుల ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమాలో స్టార్ నటులు, సీనియర్ నటులు నటిస్తుండగా.. ఈ ప్రతిష్ఠాత్మక వెంచర్‌లో ఓ బాలీవుడ్ నటీమణి కూడా నటించే అవకాశం ఉందని సమాచారం.
ఆ వివరాల్లోకి వెళితే.. ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్ర కోసం బాలీవుడ్ నటి విద్యాబాలన్‌ని సంప్రదించిందట చిత్ర బృందం. ఆమెకు కథ నచ్చినా.. ఆమె వైపు నుంచి ఎటువంటి ధృవీకరణ రాకపోవడంతో.. ఆమె కోసం గత మూడు వారాలుగా చిత్ర బృందం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది.
మే మొదటి వారం నుంచి సెట్స్ పైకి వెళ్లబోయే ఈ చిత్రానికి.. అప్పటికల్లా ఈ నటీమణి ఓకే చెప్పే అవకాశం ఉందని చిత్ర బృందం చెబుతోంది. ఇదిలా ఉంటే..
మే నుంచి ప్రారంభమయ్యే చిత్రీకరణలో బాలకృష్ణపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. వీలైనంత త్వరగా సినిమాని పూర్తి చేసి దసరాకు విడుదల చేయాలని బాలకృష్ణ భావిస్తునట్లుగా సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com