శర్వానంద్ హ్యాట్రిక్ కొడతాడా?
Send us your feedback to audioarticles@vaarta.com
డిఫరెంట్ సబ్జెక్ట్లతో అన్ని వర్గాల ప్రేక్షకులకి చేరువైన ఈ తరం కథానాయకుడు శర్వానంద్. ట్రెడీషనల్గా ఉన్న క్యారెక్టర్స్ అయినా, ట్రెండీ గా ఉండే క్యారెక్టర్స్ అయినా.. శర్వాకి ఇట్టే సూట్ అవుతాయి. ఇదిలా ఉంటే.. శర్వానంద్ కొత్త చిత్రం 'మహానుభావుడు' ఈ నెల 29న దసరా కానుకగా రిలీజ్ కానుంది. మారుతి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో మెహరీన్ హీరోయిన్. అంతేకాదు..యువి క్రియేషన్స్‌లో శర్వానంద్ నటిస్తున్న మూడో చిత్రం.
శర్వానంద్ హీరోగా యువి క్రియేషన్స్ నిర్మించిన గత రెండు చిత్రాలు 'రన్ రాజా రన్', 'ఎక్స్‌ప్రెస్ రాజా' సక్సెస్ అయ్యాయి. ఈ నేపథ్యంలో 'మహానుభావుడు ' కూడా హిట్ అయితే వారి కాంబినేషన్‌కి హ్యాట్రిక్ దక్కినట్టే. శర్వానంద్ గత చిత్రం 'రాధ' ఆశించిన విజయం సాధించని నేపథ్యంలో 'మహానుభావుడు' విజయం కీలకంగా మారింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments