దెబ్బతిని కడుపు మండి ఉన్నా.. మీ అంతు చూస్తా!

  • IndiaGlitz, [Monday,January 28 2019]

2019 ఎన్నికల్లో తన సత్తా ఏంటో చూపిస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. గుంటూరు జిల్లాలో జరిగిన శంఖారావం సభలో పవన్ మాట్లాడుతూ కార్యకర్తల్లో ఫుల్‌ జోష్‌ నింపారు. సభా వేదికగా ఇద్దరు అభ్యర్థులను ప్రకటించడం, అధికార, ప్రతిపక్ష పార్టీలపై తీవ్ర స్థాయిలో విమర్శలు.. జనసైన్యానికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. తాను బాపట్లలో పుట్టిన వాడినని.. దశాబ్దం తరువాత గుంటూరు సభకు వచ్చానని ఆయన చెప్పుకొచ్చారు. దెబ్బతిని వచ్చానని.. కడుపు మండి ఉన్నామని ఈ ఎన్నికల్లో తన సత్తా ఏంటో చూపిస్తానన్నట్లుగా పవన్ చెప్పుకొచ్చారు. 

నాకు ఎంతో స్టార్ డమ్ ఉన్నా..!

అవినీతి, వారసత్వ రాజకీయాలతో విసిగిపోయాం.బాధ్యత లేని రాజకీయాలను తొలగించాలి. నాకు ఎంతో స్టార్ డమ్ ఉన్నా తృప్తి లేదు. అవినీతి ప్రక్షాళన జరగాలి. అందుకే సినిమాలను వదిలి రాజకీయాల్లోకి వచ్చాను. డబ్బు సంపాదనకు నాకు సినిమాలు ఉన్నాయి.  రాజకీయాలు అవసరం లేదు. ‘కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్’ ఏదో రోజు రాజకీయ పార్టీగా మారాలని ఆ రోజు పెట్టాను. బాధల్లో ఉన్న అన్నతమ్ముళ్ళు, అక్కచెల్లెళ్ళకు అండగా ఉండేదుకే రాజకీయాలోకి వచ్చాను. నా దగ్గర డబ్బులు లేవు, కానీ నన్ను నమ్మి నా వెంట నడిచే వారు లక్షల మంది వస్తారనే ధైర్యం. మా నాన్న సీఎం కాబట్టి నేను సీఎం కావాలని అనుకోవడం లేదు. వారసత్వ రాజకీయాలకు స్వస్తి పలకాలి. ప్రజల కోసం చావడానికి సిద్దమై వచ్చాను.  నా లాంటి వాడు కూడా మౌనంగా ఉంటే అవినీతి పరులు రాజ్యమేలుతారు. మన పాలకులు చేసిన తప్పులకు తెలంగాణలో మనల్ని ద్రోహులుగా  చూశారు అని పవన్ తీవ్ర ఆగ్రహంతో చెప్పుకొచ్చారు.

ఎంత సేపూ మీరేనా..!

యువతను అన్ని పార్టీలు ఓట్లు వేసే యంత్రాలుగా  చూశారు. వచ్చే 30 ఏళ్ళు సీఎంగా ఉండాలని జగన్ అంటున్నారు. మళ్లీ నేను రావాలి.. తర్వాత మా కొడకు రావాలని బాబు అంటున్నారు. అవినీతిని పూర్తి స్థాయిలో తగ్గించకపోయినా కనీసం పది శాతం అయినా తగ్గిస్తాను.  ఒక్క వార్డు మెంబర్ లేకపోయినా ఇంత మంది ప్రజలు వచ్చేది ఒక్క జనసేన పార్టీకే. నాకు అధికారిమే కావాలనుకుంటే గత ఎన్నికల్లో నన్ను ఆపేవాడు ఎవ్వరూ ఉండేవారు కాదు. అనుభవం రావాలనే గత ఎన్నికలలో నేను పోటీకి దిగలేదు. పార్టీ కార్యాలయం లేక పోయినా టెంట్ వేసుకోని అయినా పార్టీని నడుపుతా. నన్ను ఎవ్వరూ బెదిరించలేరు. అన్నింటికీ సిద్దపడే రాజకీయాలలోకి వచ్చాను అని జనసేనాని చెప్పుకొచ్చారు.

తెలంగాణ నేతలతో మాట్లాడా..!

రిపబ్లిక్ డే రోజున రాజ్‌భవన్‌లో జరిగిన ఎట్ హోం కార్యక్రమానికి పవన్ కల్యాణ్ హాజరై.. తెలంగాణ సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పలు విషయాలపై చర్చించిన సంగతి తెలిసిందే. శంకారావ సభలో ఆ విషయాల గురించి మాట్లాడిన పవన్.. తెలంగాణ నేతలతో మాట్లాడాను. అందరితో మర్యాదగా ఉంటాను.అలాగని తలవంచే వ్యక్తిని కాదు. నన్ను నలిపేయడానికి, తొక్కేయడానికి నేను ఏమైనా బలహీనుణ్ణీ కాదు. సామరస్యంగా ఉంటాను. అయినా నన్ను తొక్కాలని చూస్తే.. నా తలో ఎదుట వాడి తలో తెగుపడిపోవాలి. నేను గుంటూరులో పుట్టిన వాడిని... పౌరుషం గల వాణ్ణీ. కులాల పేరు చెప్పి నాయకులు బాగుపడుతున్నారుగానీ , కులాలు బాగు పడటం లేదు. కులంలో ఎవ్వరో ఒక్కరిద్దరూ తప్పు చేస్తే ఆ కులం మొత్తాన్ని మనం తప్పుపట్టడం సరికాదు అని జనసేనాని చెప్పుకొచ్చారు.

మీ అంతు చూస్తా..!

గత ఎన్నికలలో నాకు ఎంపీ పదవి అడిగి క్యాబినెట్ మంత్రి ఇవ్వమంటే ప్రధాని కాదనేవారు కాదు. మీ పదవులకు కోసం జనసేన  కావాలి. మీరు అధికారంలోకి రావడానికి జనసేన కావాలి.. కానీ జనసేన సభలకు ఆటంకాలు సృష్టిస్తున్నారు. మీరు ఎన్ని వ్యూహాలు వేసినా నేను ప్రతి వ్యూహాలు వేస్తాను. జనసేనను కనుమరుగు చేయడానికి ఎన్ని కుట్రలు పన్నుతారో పన్నండి. మీ అంతు చూస్తా...ఎవడు ఎన్ని వ్యూహాలు వేస్తారు వెయ్యండి నేను చూస్తా. డ్వాక్రా మహిళలు డబ్బు కోరుకోవడం లేదు. వాళ్లు జీవితాలు బాగుపడాలని కోరుకుంటున్నారు. మన బిడ్డ చదివే స్కూల్, మనం వైద్యం చేయించుకునే ఆసుపత్రిలే ప్రజలందరికీ అందాలి. త్వరలో గుంటూరు మిర్చి యార్డు లో రైతులతో సమావేశం అవుతా. రైతుల బాధలు తెలుసుకుంటా. ఆప్ నేత యేగేంద్ర  యాదవ్ తో రైతు సమస్యలపై చర్చించాను. బీమవరం లో నాకు ఫెక్సీలు కట్టారని జనసైనికులపై కేసులు పెట్టారు. యువతకు ఉపాది కల్పిస్తే  బైక్‌లపై తిరుగుతూ, ఫెక్సీల కోసం ఎందుకు వివాదాలు పెట్టుకుంటారు. తెలివైన యువత మీ ఇళ్లలోనే కనిపిస్తారా..? అని జనసేనాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

పగలంతా జనసేనలో.. రాత్రి టీడీపీలో!

మీరు ఎప్పుడూ నాకు సీఎం అవకాశం ఇస్తారో తెలియదు. మీ కోసం జీవితాంతం పోరాటం చేస్తా. కాలేజీల్లోకి సినిమా రాజకీయాలు ఎందుకు వస్తున్నాయి. ఆంధ్రాలో ఏ వివాదం వచ్చినా కులగొడవలు వస్తాయి. పగలంతా జనసేనలో తిరిగి రాత్రిళ్లు టీడీపీలో తిరుగుతారు. నా పక్కన కూడా చాలా మంది అలాంటి వారు ఉన్నారు. మంత్రి గంటా లాంటి వ్యక్తుల వల్లే ప్రజారాజ్యం నుమరుగైంది.  గంటా కోసం బీమీలిలో నేను ప్రచారం చేశాను. కానీ నేడు జనసేన సభలకు గంటా ఆటంకాలు సృష్టిస్తున్నారు. అవినీతి పరులు కూడా మన పార్టీలోకి రావోచ్చు. వాళ్లు అవినీతి పరులని తెలిసిన మనం పోటీకి దింపక తప్పదు అని పవన్ స్పష్టం చేశారు.

ఇద్దరు అభ్యర్థుల ప్రకటన..!

జనసేన పోరాటం చేయకపోతే డ్రెడ్జింగ్ సంస్థ ప్రైవేట్ పరం అయ్యేది. జగన్, చంద్రబాబులతో నాకు వ్యక్తిగత వైరం లేదు. 2019 ఎన్నికలు చాలా క్లిష్టంగా ఉంటాయి. నేను ఏ వ్యూహం వేసిన మీ అందరికి చెప్పే చేస్తాను. 2019 లో చట్టసభలలోకి జనసేన సభ్యులు అడుగు పెడతారు. బలంలేని జన సేన కోసం మీరు ఎందుకు పాకులాడతారు. గుంటూరు జిల్లాలో బలమైన నాయకులు, క్యాడర్ ఉన్నారు. 2014 లో తోట చంద్రశేఖర్ నా వల్లే ఓడిపోయారు. రాష్ట్ర శ్రేయస్సు కోసం నా మిత్రులను, సన్నిహితులను సైతం ఓడించేందుకు ప్రచారం చేశాను. తోట చంద్రశేఖర్ ఓడిపోయిన గుంటూరు నుంచే 2019 లో గెలిపిస్తానని మాట ఇచ్చాను. నాదెండ్ల మనోహర్ తెనాలి నుంచి పోటీ చేయబోతున్నారు అని ఇద్దరు అభ్యర్థులను పవన్ ప్రకటించారు. 

అమరావతి గడ్డపై జెండా ఎగరేస్తాం!

అమరావతి గడ్డపై జనసేన జెండా ఎగరేస్తాం. గుంటూరు జిల్లాలో జనసేన బలం చూపిస్తాం.బడుగు, బలహీన వర్గాలను అక్కున  చేర్చుకోని అమరావతిని స్వాదీనం చేసుకుంటాం. మీరు నాకు అండగా ఉన్న లేకున్నా.. నేను మీకు జీవితాంతం అండగా ఉంటాను.నాది కులం రెల్లి కులం. అన్ని కులాలకు రాజకీయ ప్రాధాన్యం కల్పిస్తా.డబ్బు, పదవి ఆశీంచుకుండా నేను రాజకీయాలు చేస్తున్నా. జనసైనికులు కూడా అదే బాటలో నడవాలి.మనకు ఉన్నది కేవలం 90 రోజులు మాత్రమే. నిద్రహారాలు మానుకోని పని చేయాలి. పల్నాటి బ్రహ్మనాయుడు స్పూర్తితో కులాల ఐక్యత జన సేన చేపట్టింది అని ఈ సందర్భంగా జనసైన్యానికి పవన్ సూచించారు.

యూపీని నాలుగు ముక్కలు చేస్తా!

మోడీ హోదాను పక్కన పెట్టారు. గజనీ చంద్రబాబుకు అప్పుడప్పుడు గుర్తుకు వస్తుంది. జగన్‌కు అసలు హోదానే పట్టడం లేదు. అందరూ ఒకే వేదిక పైకి వచ్చి హోదా కోసం పోరాటం చేద్దాం. పార్టీలు పక్కన పెట్టి కలసిరండి. ఎన్నికల్లో ఎవ్వరూ పోటీ వారుచేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌ను విడగోట్టారు. ఉత్తరప్రదేశ్‌ను నాలుగు ముక్కలు చేసే వరకు జనసేన  నిద్రపోదు. రాష్ట్ర విజన సమయంలో ఉత్తరాది నాయకలు సభలో కాళ్ల ఊపుకుంటూ కూర్చున్నారు. టీడీపీ, వైసీపీ మర్చిపోతుందేమోగానీ ఉత్తరాధి అహంకారం దించే వరకు జనసేన నిద్రపోదు. మా కార్యకర్తల మీద చేయి వేస్తే మీరు ఏ స్దాయి  నాయకులైనా మీ అంతు చూస్తా అని పవన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

కాగా.. కేంద్ర ప్రభుత్వం మొదలుకుని సీఎం చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్, మంత్రి గంటా వరకు అందరిపైనా పవన్ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే అధికార, ప్రతిపక్ష పార్టీల నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంటుందో తెలియాల్సి ఉంది.

More News

దిల్‌రాజుకు విజ‌య్ షాకిచ్చాడా?

హిట్ చిత్రాల నిర్మాత‌గా పేరున్న దిల్‌రాజు మీడియం బ‌డ్జెట్ చిత్రాల‌తో పాటు స్టార్ హీరోల సినిమాలను కూడా నిర్మిస్తుంటాడు.

షూటింగ్‌లో నానికి చిన్న పాటి గాయాలు...

నేచుర‌ల్ స్టార్ నాని ప్ర‌స్తుతం `మ‌ళ్ళీరావా` ఫేమ్ గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో చేస్తోన్న సినిమా `జెర్సీ`.

హాలీవుడ్ సినిమాలో విష్ణు!!

చాలా కాలంగా తెలుగులో సినిమాలు చేయ‌ని హీరో విష్ణు, ఇప్పుడు హాలీవుడ్ సినిమా చేస్తాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

రామ్ హీరోయిన్‌ను ఫైన‌లైజ్ చేశారా?

పూరి జగ‌న్నాథ్‌, రామ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న `ఇస్మార్ట్ శంక‌ర్‌` సినిమాలో హీరోయిన్‌గా ఎవ‌ర‌ని న‌టింప చేస్తార‌నే

ముగ్గురు స్టార్స్‌తో హిట్ సీక్వెల్‌

ఈ సంక్రాంతికి విడుద‌లై సూప‌ర్‌డూప‌ర్ హిట్ అయిన చిత్రం `ఎఫ్‌2.. ఫన్ అండ్ ఫ్ర‌స్టేష‌న్‌`.