Sharmila: అధికారంతో వివేకా హంతకులను కాపాడుతారా..?: షర్మిల
Send us your feedback to audioarticles@vaarta.com
సొంత చిన్నాన్న వివేకానందరెడ్డికే న్యాయం చేయని జగనన్న ప్రజలకు ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) తెలిపారు. పులివెందుల నియోజకవర్గం వేంపల్లెలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. రాముడికి లక్ష్మణుడు ఎలాగో.. వైఎస్‌ఆర్‌కు వివేకా అలాంటి వారే అని.. అలాంటి వ్యక్తిని దారుణంగా చంపేశారని మండిపడ్డారు.'
"ప్రజల మనిషి వివేకాను ఘోరంగా నరికి చంపేశారు. ఆయన గొడ్డలి పోట్లకు బలైపోయి ఐదేళ్లయింది. నేటి వరకు హత్య చేసిన వారికి, చేయించిన వారికి శిక్ష పడలేదు. నిందితులు యథేచ్ఛగా బయట తిరుగుతున్నారు. ఇక్కడి ఎంపీ అవినాష్‌రెడ్డి నిందితుడని సీబీఐ చెబుతోంది. డబ్బు లావాదేవీలు సహా అన్ని సాక్ష్యాలను సీబీఐ బయటపెట్టింది. కానీ సాక్షాత్తూ సీఎం జగన్ తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని హంతకులను కాపాడుతున్నారు. హంతకులను కాపాడటం న్యాయమా? సొంత చిన్నాన్న కుటుంబానికే న్యాయం చేయకపోతే ఇంకెవరికి న్యాయం చేస్తారు? ప్రజలు నమ్మి అధికారం ఇస్తే.. హంతకుడిని కాపాడతారా?" అని ప్రశ్నించారు.
నేటి వరకు ఒక్కరోజు కూడా అవినాష్‌ను జైలుకు పంపలేదు. మళ్లీ అదే హంతకుడికి టికెట్ ఇస్తారా? హంతకులను కాపాడటానికా ప్రజలు మీకు అధికారం ఇచ్చింది.ఈ అన్యాయాన్ని తట్టుకోలేకనే మీ వైఎస్ఆర్ బిడ్డ కడప ఎంపీగా పోటీ చేస్తుంది. అధర్మాన్ని ఎదురించేందుకు ఎంపీగా నిలబడ్డా. ధర్మం వైపు మీ వైఎస్ఆర్ బిడ్డ.. అధర్మం వైపు హత్యా రాజకీయాలు చేస్తున్నవారు ఉన్నారు. ఓటర్లు ధర్మాన్ని గెలిపించాలని కోరుతున్నాను. ఒకవైపు వైఎస్‌ఆర్ బిడ్డ.. మరోవైపు హంతకుడు ఉన్నాడు. ఒకవైపు న్యాయం.. మరోవైపు అధికారం ఉన్నాయి. న్యాయం వైపు నిలబడిన నన్ను కడప ఎంపీగా గెలిపించి ఆశీర్వదించండి." అని షర్మిల తెలిపారు.
ఇక వివేకా కుమార్తె సునీత మాట్లాడుతూ ఎంపీగా గెలిచిన వ్యక్తులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారని.. ప్రజల కోసం పనిచేయకుండా ఎక్కడ తిరుగుతున్నారని సునీత ప్రశ్నించారు. కడప జిల్లా ప్రజలు న్యాయం వైపు నిలబడాలా.. అన్యాయం వైపు నిలబడాలా.. అనే విషయాన్ని ఆలోచించాలన్నారు. తప్పు చేసిన వాళ్లే భయపడతారని తప్పు చేయకుంటే భయం ఎందుకని నిలదీశారు. రాజన్న బిడ్డగా వైయస్ షర్మిల ధర్మం వైపు నిలబడ్డారని.. ఆమెను ఎంపీగా గెలిపించి తమకు న్యాయం చేయాలని కోరారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com