నాగ్‌ స్థానంలో సామ్‌ రానుందా..?

  • IndiaGlitz, [Friday,October 23 2020]

తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్‌ సీజన్‌ 4 ఆరు వారాలను పూర్తి చేసుకుంటుంది. అయితే తర్వలోనే కొన్ని వారాల పాటు బిగ్‌బాస్‌4కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నాగార్జున అక్కినేని కనిపించబోవడం లేదట. అందుకు కారణమేంటనే సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. త్వరలోనే ఆయన తన వైల్డ్‌డాగ్‌ సినిమా షూటింగ్‌ కోసం థాయ్‌లాండ్‌ వెళ్లబోతున్నాడట. రెండు, మూడు వారాల పాటు షూటింగ్‌ అక్కడ జరగనుండటంతో నాగార్జున బిగ్‌బాస్‌ 4కు అందుబాటులో ఉండబోవడం లేదట. అయితే నాగార్జున స్థానంలో ప్రేక్షకులను మెప్పించేదెవరు? అనేది సర్వత్రా చర్చ జరుగుతుంది.

అయితే నెట్టింట మాత్రం బిగ్‌బాస్‌ నిర్వాహకులు నాగార్జున స్థానంలో ఆయన కోడలు, స్టార్‌ హీరోయిన్‌ సమంత అక్కినేనిని హోస్ట్‌ కనిపించేలా ఒప్పించారని వార్తలు వినిపిస్తున్నాయి. బిగ్‌బాస్‌ సీజన్‌ 3 సమయంలోనూ నాగార్జున షూటింగ్‌ కోసం కొన్ని రోజులు గ్యాప్‌ తీసుకుంటే ఆ స్థానంలో రమ్యకృష్ణ.. బిగ్‌బాస్‌ షోకు హోస్ట్‌గా వ్యవహరించారు. ఇప్పుడు నాలుగో సీజన్ కూడా అదే సీన్ రిపీట్ అవుతుంది. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం.. సమంత చేస్తున్న తొలి బుల్లితెర ఎంట్రీ ఇదే అవుతుంది. అంతే కాదు.. సమంత ప్రేకకులను ఎలా ఆకట్టుకుంటుందనేది మరింత ఆసక్తిగానూ మారింది. మరి ఈ సస్పెన్స్ కు తెరపడాలంటే వెయిటింగ్ తప్పదు.

More News

'ఆకాశం నీ హద్దురా'... రిలీజ్‌ను వాయిదా వేసిన సూర్య

తమిళంతో పాటు తెలుగులోనూ మార్కెట్ ఉన్న హీరోల్లో సూర్య ఒక‌రు.

ఇండియా మాజీ క్రికెట్ కెప్టెన్ కపిల్ దేవ్‌కు గుండెపోటు..

ఇండియా మాజీ క్రికెట్ కెప్టెన్ కపిల్ దేవ్ గుండెపోటుతో ఢిల్లీలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు.

వాట్సాప్‌లో కొత్త ఫీచర్..

వాట్సాప్‌లో ఒక కొత్త ఫీచర్ వచ్చింది. అయితే ఇది గతంలో ఉన్నదే అయినా దీనికి టైమ్ పిరియడ్ ఉండేది కానీ ఇప్పుడు టైమ్ పిరియడ్‌తో

మరో పది రోజుల్లో శశికళ విడుదల..

దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ పదిరోజుల్లో విడుదలయ్యే అవకాశముందని ఆమె తరఫు న్యాయవాది రాజా సెంధూర్‌ పాండ్యన్‌ ప్రకటించారు.

దీక్షిత్ కేసు: ఏడాదిగా డింగ్ టాక్ యాప్ వాడుతున్న నిందితుడు

దీక్షిత్‌రెడ్డి కిడ్నాప్, హత్య కేసు రిమాండ్ రిపోర్ట్‌ను పోలీసులు రూపొందించారు. ఈ రిపోర్టులో పలు విషయాలను పేర్కొన్నారు.