బన్నీ మూవీలో సాయిపల్లవి.. ఆ పాత్రకు ఓకే చెబుతుందా?
Send us your feedback to audioarticles@vaarta.com
విలక్షణమైన పాత్రలు చేస్తూ హీరోయిన్‌గా తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకుంది సాయిపల్లవి. వరుస అవకాశాలతో సాయిపల్లవి ప్రస్తుతం బిజి బిజీగా ఉంటుంది. మెగాక్యాంపు విషయానికి వస్తే ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి ‘వేదాళం‘ రీమేక్‌లో చెల్లెలు పాత్రలో సాయిపల్లవి నటిస్తుందని వార్తలు వచ్చాయి. అలాగే పవన్‌కల్యాణ్ హీరోగా చేస్తున్న ‘అయ్యప్పనుమ్ కోశియమ్’ సినిమా రీమేక్‌లోనూ పవన్ జోడీగా సాయిపల్లవి నటిస్తుందని అన్నారు. తాజాగా స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ సినిమాలోనూ నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వివరాల మేరకు అల్లు అర్జున్, సుకుమార్‌కాంబినేషన్‌లో ప్యాన్ ఇండియా మూవీగా ‘పుష్ప’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో సాయిపల్లవి నటిస్తుందంటూ టాక్ హల్‌చల్ చేస్తోంది.
అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమా జనవరి 8 నుండి మారేడుమిల్లిలో పునః ప్రారంభం కానుంది. ఇందులో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుంది. కాగా.. బన్నీ చెల్లెలు పాత్రలో సాయిపల్లవిని నటింప చేయడానికి సుకుమార్ ప్రయత్నాలు మొదలు పెట్టాడని అంటున్నారు. ప్యాన్ ఇండియా మూవీ కాబట్టి, స్టార్ హీరోయిన్ చెల్లెలు పాత్రలో నటిస్తే మార్కెట్ పరంగా, క్రేజ్ పరంగా సినిమాకు ఇంకా ప్లస్ అవుతుందని యూనిట్ భావిస్తోందట. మరి బన్నీ పక్కన సాయిపల్లవి నటించడానికి ఓకే చెబుతుందా? అనేది ఆలోచించాల్సిన విషయమే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments