పవన్ సినిమాకు సాయి పల్లవి నో చెబుతుందా?
Send us your feedback to audioarticles@vaarta.com
సాయి పల్లవి.. యాక్టింగ్ విషయంలో కూడా సింగిల్ పీసే.. కొన్ని పాత్రలు ఆమెలా ఏ హీరోయిన్ కూడా చేయలేదు. దీంతో సాయిపల్లవికి టాలీవుడ్‌లో తిరుగు లేకుండా పోయింది. అమ్మడు వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’తో ఆమె రేంజే మారిపోయింది. ప్రస్తుతం అదే డైరెక్టర్ దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ సినిమాలో నాగచైతన్యతో కలిసి నటిస్తోంది. మరోవైపు రానాకు జోడిగా ‘విరాటపర్వం’.. నానితో ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాలోనూ చేస్తోంది. దీంతో సాయి పల్లవి బాగా బిజీగా ఉంది.
కాగా.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో తెరకెక్కనున్న ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్‌లో కూడా సాయిపల్లవి నటిస్తున్నట్టు టాక్ నడుస్తోంది. పవన్‌కు భార్యగా సాయి పల్లవి నటిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటికే సాయిపల్లవి చేతిలో మూడు సినిమాలు ఉండటంతో.. ‘అయ్యప్పనుమ్ కోషియమ్’కు డేట్లు కేటాయించడం కష్టమైనట్టు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాలో సాయి పల్లవి డేట్స్ అడ్జెస్ట్ చేసుకుని నటిస్తుందా.. లేదంటే నో చెప్తుందా? అనేది సస్పెన్స్‌గా మారింది.
కాగా.. ఈ సినిమాకు సంబంధించిన ఓ వీడియోను ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ విడుదల చేశారు. ఈ వీడియోలో సినిమాకు పని చేస్తున్న సాంకేతిక నిపుణుల పేర్లను తమన్ వెల్లడించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సినిమాకు డైలాగులు, స్క్రీన్‌ప్లే అందించనున్నారు. సాగర్ కె. చంద్ర డైరక్షన్‌లో సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సంగీతం తమన్ అందిస్తున్నారు. సముద్రఖని, బ్రహ్మాజీ, మురళీశర్మ, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారని సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments