సాయిధరమ్ కి ఈ సారైనా కలిసొస్తుందా?
Send us your feedback to audioarticles@vaarta.com
సుప్రీమ్ తరువాత సరైన విజయం లేక ఇబ్బంది పడుతున్నాడు మెగా ఫ్యామిలీ హీరో సాయిధరమ్ తేజ్. తిక్క, విన్నర్, నక్షత్రం, జవాన్.. ఇలా సాయిధరమ్ నటించిన నాలుగు వరుస చిత్రాలు ఫెయిల్యూర్స్ అయ్యాయి. ఈ నేపథ్యంలో కొత్త చిత్రంపైనే తన ఆశలన్నింటిని పెట్టుకున్నాడు ఈ యువ కథానాయకుడు. ఆ చిత్రమే వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం. కాగా, ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 9న విడుదల చేయబోతున్నట్లు చిత్ర నిర్మాతలు ప్రకటించారు.
ఈ ఏడాదిలో వచ్చిన విన్నర్ చిత్రం కూడా ఇదే ఫిబ్రవరిలో విడుదలైంది. అయితే ఆ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. మరి కొత్త చిత్రం విషయంలోనైనా సాయికి ఫిబ్రవరి కలిసొస్తుందేమో చూడాలి. లావణ్య త్రిపాఠి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతమందిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు ఎ.కరుణాకరన్ దర్శకత్వంలోనూ సాయి ఓ సినిమా చేస్తున్నాడు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ఇటీవలే రెగ్యులర్ షూటింగ్‌ని ప్రారంభించుకుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments