సాయిధరమ్ కి ఈ సారైనా కలిసొస్తుందా?

  • IndiaGlitz, [Monday,December 18 2017]

సుప్రీమ్ త‌రువాత స‌రైన విజ‌యం లేక ఇబ్బంది ప‌డుతున్నాడు మెగా ఫ్యామిలీ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్‌. తిక్క‌, విన్న‌ర్‌, న‌క్ష‌త్రం, జ‌వాన్‌.. ఇలా సాయిధ‌ర‌మ్ న‌టించిన నాలుగు వ‌రుస చిత్రాలు ఫెయిల్యూర్స్ అయ్యాయి. ఈ నేప‌థ్యంలో కొత్త చిత్రంపైనే త‌న ఆశ‌ల‌న్నింటిని పెట్టుకున్నాడు ఈ యువ క‌థానాయ‌కుడు. ఆ చిత్ర‌మే వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం. కాగా, ఈ చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 9న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు చిత్ర నిర్మాత‌లు ప్ర‌క‌టించారు.

ఈ ఏడాదిలో వ‌చ్చిన విన్న‌ర్ చిత్రం కూడా ఇదే ఫిబ్ర‌వ‌రిలో విడుద‌లైంది. అయితే ఆ సినిమా ఆశించిన విజ‌యం సాధించ‌లేదు. మ‌రి కొత్త చిత్రం విష‌యంలోనైనా సాయికి ఫిబ్ర‌వ‌రి క‌లిసొస్తుందేమో చూడాలి. లావ‌ణ్య త్రిపాఠి క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి థ‌మ‌న్ సంగీత‌మందిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు ఎ.కరుణాక‌ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలోనూ సాయి ఓ సినిమా చేస్తున్నాడు. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రం ఇటీవ‌లే రెగ్యుల‌ర్ షూటింగ్‌ని ప్రారంభించుకుంది.

More News

అజ్ఞాత‌వాసికి స్ఫూర్తి ఆ పుస్త‌క‌మేనా?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న 25వ చిత్రం అజ్ఞాత‌వాసి. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్‌, అను ఇమ్మాన్యుయేల్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు.

ఈ వారంలోనే జై సింహా టీజ‌ర్‌

న‌ట‌సింహ బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న తాజా చిత్రం జై సింహా. ప్ర‌ముఖ త‌మిళ ద‌ర్శ‌కుడు కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో న‌య‌న‌తార, హ‌రి ప్రియ‌, న‌టాషా దోషి క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు.

'ఎంసీఏ'తో ఈ ఏడాది మా బ్యాన‌ర్‌లో డ‌బుల్ హ్యాట్రిక్ కొడుతున్నాం - దిల్‌రాజు

డ‌బుల్ హ్యాట్రిక్ హీరో.. నేచుర‌ల్ స్టార్ నాని, హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు కాంబినేష‌న్‌లో రూపొందిన సినిమా 'ఎం.సి.ఎ'. సాయిప‌ల్ల‌వి హీరోయిన్‌గా న‌టించింది.

దుబాయ్ లో సాక్ష్యం షూటింగ్

టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీవాస్ - యంగ్ అండ్ మోస్ట్ హ్యాపెనింగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా "సాక్ష్యం" అనే డిఫరెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ను తెరకెక్కిస్తున్నారు.

అంధుడిగా ఆది పినిశెట్టి?

11 ఏళ్ల క్రితం విడుద‌లైన ఒక విచిత్రంతో క‌థానాయ‌కుడిగా తొలి అడుగులు వేశాడు ఆది పినిశెట్టి. ఆ చిత్రం ఆశించిన విజ‌యం సాధించ‌క‌పోవ‌డంతో.. త‌మిళ ప‌రిశ్ర‌మ‌లో ప్ర‌య‌త్నాలు చేశాడు.