వైసీపీ గెలిస్తే రోజాకు ఇచ్చే మంత్రి పదవి ఇదేనా!
Send us your feedback to audioarticles@vaarta.com
గెలిచేది మేమే.. 2014లో జస్ట్ మిస్సయ్యింది.. ఈ సారి పక్కాగా గెలుపు మాదే.. రాసిపెట్టుకోండి 2019 మాదే.. అని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు టీడీపీ సైతం కచ్చితంగా రెండోసారి ప్రభుత్వాన్ని మేమే ఏర్పాటు చేయబోతున్నామని చెప్పుకుంటున్నారు. ఇక వైసీపీ నేతలు పోలింగ్ రోజే మేం గెలిచేశామని.. మే-23న అధికారిక ప్రకటన ఉంటుందంతే.. అని మంత్రి పదవులు సైతం పంచేసుకుంటున్నారు. ముఖ్యంగా నగరి వైసీపీ అభ్యర్థి, ఫైర్‌బ్రాండ్ రోజాకు ఇచ్చే మంత్రి పదవి ఇదేనంటూ పెద్ద ఎత్తున వార్తలు వినవస్తున్నాయి.
ఈ రెండింటిలో రోజాకు ఏ శాఖ!
ఇక అసలు విషయానికొస్తే.. వైసీపీ అధికారంలోకి వస్తే కచ్చితంగా చిత్తూరు జిల్లాకు కనీసం లేదంటే మూడు మంత్రి పదవులు కచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే మరి. వారిలో ఒకరు రోజా పక్కా. అయితే రోజాకు ఏ శాఖ ఇస్తారు..? అసలు రోజా రెండోసారి గెలుస్తారా..? లేదా అనేది గత కొన్ని రోజులుగా ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా అయ్యింది. అంతేకాదు వైసీపీ గెలిస్తే ఎవరెవరికి ఏ శాఖ అన్నది జాబితా కూడా వైరల్ అవుతోంది. ఆ జాబితాను బట్టి చూస్తే.. ఎమ్మెల్యే రోజాకు విద్యుత్ శాఖ లేదా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఇస్తారని తెలుస్తోంది.
రోజా గెలిచే అవకాశాలున్నాయా..?
కాగా.. టీడీపీ హయాంలో ఈ శాఖకు పరిటాల సునీత మంత్రిగా ఉన్న విషయం తెలిసిందే. అంటే పరిటాల సునీత స్థానం రోజా దక్కించుకోబోతోందన్న మాట. అయితే గత ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో గట్టెక్కిన రోజా.. ఈసారి భారీ మెజార్టీ దక్కించుకోవాలని.. జబర్దస్ షో వ్యవహారం మినహా మిగిలిన అన్ని రోజులూ ప్రజల మధ్యనే ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా క్యాంటిన్లు ఏర్పాటు చేయడం, ట్రస్ట్ ద్వారా ఉద్యోగాలు చూపించడం, మహిళల కోసం ధర్నాలు చేయడం, మైనింగ్ వ్యవహారాలపై పోరాటం చేయడం ఇవన్నీ ఈసారి రోజాకు ప్లస్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
ప్రత్యర్థికీ ప్లస్‌లు ఉన్నాయ్!
అయితే అటు ప్రత్యర్థి గాలి భానుప్రకాష్‌కు కూడా తండ్రి చనిపోయారనే సింపతీ.. రెండోసారి ఇదే కుటుంబం పోటీ చేస్తోంది.. ఆదరించి అసెంబ్లీకి పంపుదామని ప్రజలు అనుకొని ఉంటారని గాలి కుటుంబం, టీడీపీ బలంగా నమ్ముతోంది. అయితే వారి కుటుంబంలోనే ఒకరిలో ఒకరు లేకపోవడం.. అభ్యర్థిగా కూడా ఎన్నికలకు ముందు ప్రకటించడం ఈ పరిణామాలు టీడీపీకి మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో.. ఫైనల్‌గా గెలుపెవరిదో.. రోజా ఏ మాత్రం గెలిచి నిలిచి మంత్రి పదవి దక్కించుకుంటారో తెలియాలంటే మే-23 వరకు వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments